MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Andhra Pradesh
  • DWCRA Groups for Men: పురుషులకు డ్వాక్రా సంఘాలు.. రూ.1.50 లక్షలు ఇస్తున్నారు.. ఎలా చేరాలో తెలుసా?

DWCRA Groups for Men: పురుషులకు డ్వాక్రా సంఘాలు.. రూ.1.50 లక్షలు ఇస్తున్నారు.. ఎలా చేరాలో తెలుసా?

DWCRA Groups for Men: ఏపీలోని పురుషులకు శుభవార్త.. మహిళలకు పొదుపు సంఘాలు ఉన్నట్లు పురుషులకు కూడా డ్వాక్రా సంఘాలు వచ్చేశాయండీ. నెల నెల మహిళా సంఘాలు పనిచేసినట్లు పురుషుల సంఘాలు కూడా పనిచేయనున్నారు. డబ్బు పొదుపు చేసుకుని ప్రభుత్వ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. మరి ఈ సంఘాలలో ఎలా చేరాలి? బ్యాంకుల నుంచి రుణాలు ఎలా పొందాలో తెలుసుకుందామా!   

2 Min read
Bala Raju Telika
Published : Apr 12 2025, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
AP Launches DWCRA Groups for Men

AP Launches DWCRA Groups for Men

పేదరిక నిర్మూలనలో భాగంగా డ్వాక్రా సంఘాలు మహిళల కోసం ఏర్పడ్డాయి. అయితే.. వీటికి ఆధరణ రావడంతో పురుష సంఘాల ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ ఇటీవల ప్రకటించింది. తొలుత పైలెట్‌ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 25 నగరాలను ఎంపిక చేయగా.. ఏపీలో విజయవాడ, వైజాగ్‌ నగరాలను ఎంపిక చేశారు. ఇప్పటికే రెండు నగరాల్లో కలిపి వెయ్యి సంఘాల వరకు ఏర్పడ్డాయి.  

25
Avail ₹1.5 Lakh Bank Loan at 7% Interest

Avail ₹1.5 Lakh Bank Loan at 7% Interest

పురుషుల పొదుపు సంఘంలో కనీసం 5గురు సభ్యులు ఉండాలి.. గరిష్టంగా 10 మంది సభ్యులు ఉండాల్సి ఉంటుంది. మెప్మా ఆధ్వర్యంలో ఈ సంఘాలను నిర్వహిస్తారు. ఈ సంఘాల్లో అందరికీ అవకాశం ఇవ్వలేదు. కేవలం వివిధ పనులు చేసుకునే కార్మికులు, భవన నిర్మాణ, రవాణారంగం కార్మికులు, డే కేర్ సెంటర్​లో పనిచేసే వారు అర్హులు. జొమాటో, స్విగ్గీ వంటి ఈకామర్స్‌లో పనిచేసేవారు పారిశుద్ధ, ఇళ్లలో పనిచేసే అర్హులని ప్రభుత్వం చెబుతోంది. వయసు 18-59 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొంది. 

35
Bank Loan at 7% Interest

Bank Loan at 7% Interest

గ్రూపులో చేరిన ఒక్కో సభ్యుడు కనీసం నెలకు రూ.100 వరకు పొదపు చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎంతైనే పొదుపు పెంచుకునే వీలుంది. ఆరు నెల తర్వాత వారు చెల్లించిన డబ్బు కంటీ కనీసం ఆరు రెట్లు అప్పును ప్రభుత్వ బ్యాంకుల నుంచి పొందవచ్చు. వీటిని నెలవారీ కిస్తీలు చెల్లించుకోవచ్చు. అయితే.. బ్యాంకుల నుంచి 7 శాతం వడ్డీతో ఈ రుణాలను ఇవ్వనున్నారు. 

45
ap government

ap government

ఏపీలో మొదటి పట్టణ ప్రాంతాల్లో పురుష సంఘాలు ప్రారంభమయ్యాయి అది కూడా కేవలం రెండు నగరాల్లోనే ఇక్కడ విజయవంతం అయిన తర్వాత మిగిలిన నగరాలతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ సంఘాలు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపడతారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పురుష సంఘాలు ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభమయ్యాయి. ఆ ప్రాంతాలకు చెందిన వారు ఉంటే చేరవచ్చు. 

 

55
₹1.5 Lakh Bank Loan at 7% Interest

₹1.5 Lakh Bank Loan at 7% Interest

పొదుపు సంఘాలల్లో చేరాలనుకునే పురుషులు వారి ఆధార్, పనిచేస్తోన్నట్లు ఐడీ కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. దీంతోపాటు ఓ అయిదుగురు కలిస్తే ఓ గ్రూపును ఏర్పాటు చేస్తారు. ఈ గ్రూపుల్లో చేరాలనుకునే వారు స్థానికంగా ఉన్న సచివాలయాలు, మెప్మా కార్యాలయాలకు వెళ్తే అక్కడి అధికారులు గ్రూపులను ఏర్పాటు చేస్తారు. గ్రూపు ఏర్పడిన ఆరు నెలల తర్వాత బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు రుణం బ్యాంకులు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బయట అధిక వడ్డీలకు, రోజు వారీ వడ్డీలకు లేదా లోన్‌ యాప్‌లో డబ్బులు తీసుకుని వడ్డీ రేట్లతో ఇబ్బందులు పడేకంటే ఇలా పురుష సంఘాల్లో చేరి రుణాలు పొందడం మంచిది కదా. 

Bala Raju Telika
About the Author
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత. Read More...
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ
పవన్ కళ్యాణ్
జనసేన
నారా లోకేష్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved