MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • నీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

నీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నీటిపారుదల అంశంపై జరిగిన చర్చ పరోక్షంగా ఏపీ సీఎం వై.ఎస్. జగన్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

2 Min read
Author : narsimha lode
Published : Feb 13 2024, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై  తెలంగాణ అసెంబ్లీలో జరిగిన  చర్చను  వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం  జగన్ ఏం చేశాడో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని  ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

28
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల  12న  కృష్ణా నదిపై  ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి  అప్పగించవద్దని  తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై చర్చ జరిగింది.ఈ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. 

38
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

శ్రీశైలం ప్రాజెక్టు నుండి  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా  కృష్ణా జలాలను  92, 500 క్యూసెక్కులు తీసుకెళ్లేందుకు  బీఆర్ఎస్ సర్కార్  సానుకూలంగా వ్యవహరించిందని కాంగ్రెస్ ఆరోపించింది.  

48
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

1983లో  పోతిరెడ్డి పాడు ద్వారా  11,150 క్యూసెక్కులను ప్రతి రోజూ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే  2005 లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  11, 500 క్యూసెక్కుల నీటిని  44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లేందుకు వీలుగా  ప్రభుత్వం  ఏర్పాట్లు చేసింది

58
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రతి రోజూ 92,500 క్యూసెక్కుల పెంచిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది.  అయినా కేసీఆర్ సర్కార్  దీన్ని ఆపలేదన్నారు.2004 నుండి  2014 వరకు  727 టీఎంసీలు తీసుకుంటే... 2014 నుండి  2024 వరకు  1,201 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లిన విషయాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

68
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఏపీ అసెంబ్లీలో  వై.ఎస్. జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడ  ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో  ఎమ్మెల్యేలకు చూపారు.

78
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నీటి విషయంలో  రాష్ట్రానికి ఏం చేశారనే విషయాన్ని  తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చను చూస్తే అర్ధమౌతుందని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో  ప్రజల గురించి చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.  ముఖ్యమంత్రిగా  రాష్ట్రానికి జగన్ మేలు గురించి తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిన విషయాన్ని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు.

88
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమౌతున్నాయి. ఈ తరుణంలో  తెలంగాణ అసెంబ్లీ చర్చను  తమకు అనుకూలంగా  వైఎస్ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రచారానికి ఉపయోగించుకొనే అవకాశం లేకపోలేదని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

NL
narsimha lode
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
Recommended image2
Now Playing
AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu
Recommended image3
Now Playing
Pawan Kalyan Super Speech: మీచేతఅప్పుడే జేజేలు కొట్టించుకుంటా | Janasena Party | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved