Pawan Kalyan: 'ఆ పని మాత్రం చేయొద్దు '.. దళపతి విజయ్‌కి డిప్యూటీ సీఎం పవన్ సలహా.!
Pawan Kalyan: దళపతి విజయ్‌తో ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు పలు కథనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి.? పొత్తు పెట్టుకోవాలా.? లేక వద్దా.? లాంటి విషయాలపై పలు రాజకీయ సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి అదేంటంటే.?

అటు పవన్ - ఇటు విజయ్
ఇద్దరూ సినిమా నేపథ్యం నుంచి వచ్చారు. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. ఎత్తుపల్లాలను ఎదుర్కున్నారు. అదేనండీ.! మేము పవన్ కళ్యాణ్, దళపతి విజయ్ గురించి మాట్లాడుతున్నాం. 2019లో ఘోర ఓటమిని చవిచూసిన పవన్ కళ్యాణ్.. 2024లో అద్భుత విజయాన్ని సాధించి.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక దళపతి విజయ్ ప్రస్తుతం తన తొలి తమిళనాడు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
విజయ్‌తో పవన్ ఫోన్ కాల్
ఇదిలా ఉంటే.. పలు జాతీయ కథనాలు ప్రకారం.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దళపతి విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారట. రాజకీయంగా పలు సలహాలు సైతం సూచించారని సమాచారం.
ఒంటరిగా పోటీ చేసి రిస్క్ తీసుకోవద్దు.?
ఒంటరిగా పోటీ చేసి రిస్క్ తీసుకోవద్దు అని పవన్ కళ్యాణ్.. విజయ్‌కు చెప్పారట. సినీ ఫేం రాజకీయ విజయానికి ఉపయోగపడదని.. కచ్చితంగా ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలని విజయ్‌కి చెప్పినట్లు సమాచారం.
వ్యక్తిగత సంభాషణ లేదా ఫోన్ కాల్.?
ఏఐడీఎంకే-బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకోవాలని పవన్ విజయ్‌కు సూచించారట. తద్వారా కూటమి గెలిస్తే విజయ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టే ఛాన్స్ ఉందని.. లేదా ఓడిపోయినా ప్రతిపక్ష హోదా లభిస్తుందని ప్రస్తావించారట.
స్పష్టత లేదు.. అధికారిక ప్రకటన రాలేదు..!
ఈ మేరకు పవన్ విజయ్‌కి సలహా ఇచ్చినట్టు జాతీయ కథనాలు పేర్కొన్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది వ్యక్తిగత సంభాషణ కావచ్చు. అందుకే ఈ వార్తపై వాస్తవాలను పూర్తిగా ధృవీకరించలేం.