దూకుడు తెచ్చిన తంటా: జగన్‌ కేబినెట్‌‌లో రోజా మిస్?

First Published 31, May 2019, 12:05 PM IST

 వివాదాలకు దూరంగా ఉండే వారికి తన కేబినెట్‌లో వైఎస్ జగన్ చోటు కల్పించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.వచ్చే నెల 7 లేదా 8వ తేదీన జగన్ తన కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది.
 
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. కులం, ప్రాంతం, జెండర్, జిల్లాలతో పాటు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు లాంటి వారికి చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు.

సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుండి కోడెల శివప్రసాదరావును అంబటి రాంబాబు ఓడించాడు. కోడెల శివప్రసాదరావు 2014 నుండి 2019 వరకు ఏపీ అసెంబ్లీకి స్పీకర్‌గా వ్యవహరించాడు.

కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి జగన్ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. 9 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని అంబటి రాంబాబు వైసీపీలో కొనసాగారు.వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా కూడ అంబటి రాంబాబు కొనసాగారు.రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి అంబటి రాంబాబు ఆ కుటుంబానికి ఫాలోవర్‌గా కొనసాగుతున్నాడు.

కాపు కోటా కింద అంబటి రాంబాబుకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గానికి మూడు లేదా నలుగురికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

జగన్‌తో పాటు తన మంత్రివర్గంలో 26 మంది మంత్రులు ఉండేందుకు ఛాన్స్ ఉంది. మూడు లేదా నలుగురికి కేబినెట్‌లో చోటు దక్కితే అంబటి రాంబాబుకు చోటు దక్కకపోవచ్చనే ప్రచారం కూడ ఉంది.

వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. గుంటూరు జిల్లా నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం దక్కుతోందనే వైసీపీలో ప్రచారంలో ఉంది.

గుంటూరు జిల్లా నుండే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు.

మైనార్టీ కోటా కింద గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుండి మహ్మద్ ముస్తఫాకు కూడ జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మైనార్టీ కోటా కింద కడప జిల్లాకు చెందిన అంజర్ భాషా కూడ జగన్ కేబినెట్‌లో చోటు కోసం ఆసక్తిగా ఉన్నారు. కడప జిల్లా నుండి పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కురుముట్ల శ్రీనివాసులుకు కూడ కేబినెట్‌ బెర్త్ దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం ఉంది. ఇదే జిల్లా నుండి నగరి ఎమ్మెల్యే రోజా కూడ మంత్రి పదవిని ఆశిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది.

అయితే ఇదే జిల్లా నుండి ఎమ్మెల్యేలుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల నుండి రోజా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నట్టుగా ప్రచారంలో ఉంది. అయితే రోజాకు మహిళల కోటాలో కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ ఉందని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

టీడీపీ ప్రభుత్వం రోజాను తీవ్రమైన అవమానాలకు గురి చేసింది. ఆమెకు కేబినెట్‌లో చోటు కల్పిస్తే జగన్‌ ఆమెకు మంచి బహుమతి ఇచ్చినట్టుగా ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

loader