బాబుగారి కాళ్ళకు దండ్డం పెట్టు అకీరాకు పవన్ సూచన, జనసేన కార్యాలయంలో పవర్ స్టార్ తో చంద్రబాబు భేటీ..
ఈ ఏన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమిలో విజయోత్సాహం ఏరులై పారుతోంది. ఈసందర్భంగా జనసేన ఆఫీస్ కు వెళ్ళారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. అక్కడ కొన్ని ముచ్చటైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
దాదాపు క్లీన్ స్వీప్ చేసింది కూటమి.. గతంలో భారీగా సీట్లు సాధించిన వైసీపీ.. 10 లోపు సీట్లకే పరిమితం అయ్యింది. ఈక్రమంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను స్వయంగా కలిశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జనసేన ఆఫీసుకు చంద్రబాబు రావడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు రాకతో పవన్ దిల్ ఖుష్ అయ్యారు.
చంద్రబాబకు తన భార్యతో కలిస సాదర స్వాగం పలికారు పవన్. అక్కడే ఉన్న తన కుమారుడు అకీరాను బాబకు పరిచయం చేశారు. బాబుగారి కాళ్లకు నమస్కారం చేయాల్సిందిగా అకీరాకు సూచించారు పవర్ స్టార్. చంద్రబాబును ఘనంగా సన్మానించారు. ఆలింగనం చేసుకున్నారు పవన్. ఇక ఈ ఇద్దరి కలయిక ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.
బాబుతో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు పవర్ స్టార్. ఈ చర్చల్లో ప్రభుత్వం ఏర్పాటు.. మంత్రివర్గంతో పాటు.. ప్రభుత్వంలో పవన్ పాత్రపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అంతే కాదు ప్రమాణ స్వీకారం విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక చర్చల అనంతరం బాబుకు దగ్గరుండి కారుదాకా వచ్చి పంపించారు పవన్.
ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీసాధించింది కూటమి. టీడీపీ స్వతహాగానే 135 సీట్లు సాధించగా.. జనసేన పోటీ చేసిన 21 స్థానాలతో పాటు 2 ఎంపీస్థానాల్లో కూడా గెలుపొందింది. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవడానికి ముందు కార్యకర్తలతో మాట్లాడారు. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చేలా చూస్తామన్నారు. శాంతి బద్రతలు కంట్రోల్ లో ఉంటాయన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
గెలిచింది 21 సీట్లు అయినా.. 175 మంది బాధ్యత తమపై ఉంది అన్నారు పవర్. కక్ష్యసాధింపులు ఉండవని.. జగన్ పై తనకు కోపం లేదన్నారు. రాష్ట్రంలో చీకటి రోజులు పోయాయని అంతా మంచే జరుగుతుంది అన్నారు పవన్. ఇక చంద్రబాబుతో పవర్ స్టార్ మీటింగ్ కు సబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఏపీలో కూటమి భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకోగా.. జనసేన నిలబడ్డ 21 సీట్లలో 20 సీట్లు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార పవన్ కళ్యాణ్ భార మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు.
పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ ఘన విజయం తో సినిమా ఇండస్ట్రీతో పాటు.. అభిమానుల్లో కూడా ఆనందం వెల్లి విరుస్తోంది. మెగా ప్యామిలీ నుంచే కాకుండా.. ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవితో పాటు ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అన్న మాటలను నిలబెట్టుకున్నాురు. ఎవడ్రా మనల్ని ఆపేది.. బైబై వైసీపీ నినాదాలతో రాష్ట్రమంతా ప్రభావం చూపిన జనసేనాని.. లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ లో రెండు చోట్ల ఓడిపోయి.. ఎన్నో విమర్షలు ఎదుర్కొన్నారు. ఇక ఈసారి మాత్రం పిఠాపురం నుంచి భారీమెజారిటీతో గెలిచి మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.
ఏపీలో కూటమి భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకోగా.. జనసేన నిలబడ్డ 21 సీట్లలో 20 సీట్లు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార పవన్ కళ్యాణ్ భార మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు.