- Home
- Andhra Pradesh
- Chandrababu: 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా అరుదైన రికార్డు.. రాజకీయ దురంధరుడు సీఎం చంద్రబాబు
Chandrababu: 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా అరుదైన రికార్డు.. రాజకీయ దురంధరుడు సీఎం చంద్రబాబు
Chandrababu: సీఎం చంద్రబాబు 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ పదవీకాలం ముగిస్తే మొత్తంగా 19 ఏళ్లు పూర్తవుతాయి. ఇక అది కూడా ఒక రికార్డు అని రాజకీయ పండుతులు అంటున్నారు.

రాజకీయ దురంధరుడు సీఎం చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారు. ఆయన ఇటీవల ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. అపరచాణక్యుడిగా, రాజకీయ దురంధరుడిగా ఈ 45 ఏళ్ల పొలిటికల్ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కున్నారు చంద్రబాబు.
1995వ సంవత్సరంలో తొలిసారిగా
1995వ సంవత్సరంలో టీడీపీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా చంద్రబాబు తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి భారీ విజయాన్ని కట్టబెట్టి.. మూడోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.
15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా
దక్షిణాదిన 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన ప్రముఖుల్లో కరుణానిధి, రంగస్వామి ముందు వరుసలో ఉండగా.. ఇప్పుడు వారి లిస్టులో చంద్రబాబు కూడా చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంరక్షించేందుకు.. ఐదేళ్లకు ఒకమాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు చంద్రబాబు.
విభజన అనంతరం కూడా చంద్రబాబుదే రికార్డు
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కూడా చంద్రబాబు ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పని చేశారు. విభజన అనంతరం జరిగిన మూడు ఎన్నికల్లో చంద్రబాబు రెండుసార్లు గెలిచారు. ఆయన తన అద్భుతమైన పరిపాలనా నైపుణ్యాలు, రాజకీయ చతురతతో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు.
19 సంవత్సరాలు కూడా రికార్డే..
15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేసి ఓ సవాల్‌ను ఎదుర్కున్న చంద్రబాబు.. ఇప్పుడు ఎక్కువకాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఈ పదవీకాలం ముగిసేసరికి ఆయన ముఖ్యమంత్రిగా 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. అది కూడా ఓ రికార్డే.