చంద్రబాబు బిజీ: వైఎస్ జగన్ ఏం చేస్తున్నారు?

First Published 14, May 2019, 4:52 PM IST

అమరావతి: కేంద్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిజీగా కాలం గడేపిస్తున్నారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాల తరఫున ప్రచారం కూడా చేశారు తాజాగా మంగళవారంనాడు మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆయన బిజీగా కనిపిస్తుంటే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు

లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా జగన్ పెద్దగా సందడి చేయడం లేదు. ఈ స్థితిలో ఆయన ఏం చేస్తున్నారనే ఆసక్తి నెలకొనడం సహజం. ఎన్నికల్లో తమ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో వచ్చే ఐదేళ్లలో పాలన ఎలా సాగించాలనే విషయంపై గత నెల రోజులుగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు

జగన్ భవిష్యత్తు పరిపాలనపై తెర వెనక కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మేధావులు, సీనియర్ అధికారులు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ జరిగిన తర్వాత రాత్రి మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ రాలేదు. దీంతో ఓడిపోవడం ఖాయమని తెలిసి తెలిసి జగన్ బయటకు రావడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నెల రోజుల సమాలోచనల్లో జగన్ మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. అందరికీ విద్యను, వైద్యాన్ని అందించడం, రైతులకు ఇతర ప్రభుత్వాలేవీ అందించని సాయం అనే మూడు ప్రధానాంశాలపై ఆయన దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు

తాను చేయదలుచుకున్న పనులపై నిత్యం మేధావులు, మేధావులతో జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి సలహాలను, సూచనలను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, ప్రజలకు ఏ నాయకుడూ ఇంత వరకు చేయని విధంగా సేవలు అందించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది

loader