- Home
- Andhra Pradesh
- Tirumala : శ్రీవారి దర్శనానికి ఇదే మంచిసమయం... వెయిటింగ్ లేకుండా ఇలా వెళ్లి అలా తిరిగిరావచ్చు
Tirumala : శ్రీవారి దర్శనానికి ఇదే మంచిసమయం... వెయిటింగ్ లేకుండా ఇలా వెళ్లి అలా తిరిగిరావచ్చు
తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. ప్రస్తుతం టిటిడి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్వామివారి దర్శనం మరింత ఈజీ కానుంది.

Tirumala Temple
Tirumala : కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం తిరుమలకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దీంతో తిరుమల ఆలయలో ప్రతిరోజు రద్దీ ఉంటుంది. ఇక సెలవులు, పండగల సమయం, ప్రత్యేక రోజుల్లో అయితే తండోపతండాలుగా భక్తుల వస్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది... అయితే తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో క్యూకాంప్లెక్సుల్లో వేచివుండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనానికి వెళుతున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేసవి సెలవుల్లో భక్తులరద్దీని నియంత్రించేందుకు టిటిడి చేపట్టిన చర్యలు కూడా పనిచేస్తున్నాయి. అందువల్లే భారీగా భక్తులు తరలివచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులు సమయం ఆదా అవుతోంది.
Tirumala Temple
ఆదివారం శ్రీవారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..
తిరుమలకు వెళ్లేందుకు ఇది మంచి సమయం. భక్తుల రద్దీ తక్కువగా ఉందికాబట్టి ఈజీగా శ్రీవారి దర్శనభాగ్యం దక్కుతోంది. నిన్న(ఆదివారం) తిరుమల వెంకటేశ్వరస్వామిని 78,177 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చింది.
భక్తులు భారీగా తరలివచ్చినా స్వామివారి దర్శనానికి ఎలాంటి ఆలస్యం కావడంలేదు. భక్తులు క్యూకాంప్లెక్స్ లలో వేచివుండాల్సిన అవసరం లేకుండా దర్శనం చేసుకుంటున్నారు. చిన్నపిల్లల తల్లిదండ్రులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు.
Tirumala Temple
మే 1 నుండి విఐపి బ్రేక్ దర్శనాల్లో మార్పులు :
తిరుమలలో మే 1 నుండి ప్రజాప్రతినిధులు, టిటిడి బోర్డ్ మెంబర్స్ సిపారసు లేఖల బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. వేసవిలో భక్తుల రద్దీ నేపథ్యంలో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రోటోకాల్ వీఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు టిటిడి ప్రకటించింది.
అయితే ఇప్పటికే సిపారసు లేఖలు పొందినవారికి యధావిధిగా బ్రేక్ దర్శనం కల్పిస్తామని టిటిడి బోర్డ్ సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో భక్తులకు అనుమతి యధాతధంగా ఉంటుందని... బోర్డు సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలతో దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకులేఖలు తీసుకున్న భక్తులకు యధావిధిగా దర్శనాలు కల్పిస్తాం... ఇకపై లేఖలు తీసుకునే వారికి మాత్రం అనుమతించబోమని జ్యోతుల నెహ్రూ తెలిపారు.
Tirumala Temple
తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పులు :
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు వుంటాయని ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. మే 1 నుంచి జూలై 15 వరకు ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాల సమయాల సమయాన్ని మార్చారు.