ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మెసైరన్: బొత్స, అచ్చెన్నాయుడులలో టెన్షన్

First Published 13, May 2019, 4:36 PM IST

ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మెసైరన్: బొత్స, అచ్చెన్నాయుడులలో టెన్షన్

అమరావతి: ఏ రాష్ట్రంలో అయినా రవాణా శాఖ సమ్మెకు దిగిందంటే ఇక ఆ రాష్ట్ర ప్రజలు చుక్కులు చూడాల్సిందే. ఆర్టీసీ రేట్లు పెంచితేనే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద గోల చేస్తాయి. మరి అలాంటిది ఆర్టీసీ ఏకంగా సమ్మెకు దిగితే ఇంకేమైనా ఉందా...ఆ శాఖ అధికారులే కాదు మంత్రులు కూడా చుక్కలు చూడాల్సిందేనట.

ఆర్టీసీలో యూనియన్ సంఘాలతో చర్చలు అంటే అషామాషీ విషయం కాదు. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు పెద్ద కసరత్తే చెయ్యాల్సి ఉంటుంది. అంతేకాదు సమ్మె సమయంలో ప్రజల నుంచి తీవ్ర తిట్ల దండకాలు అందుకోవాలి ఆ రాష్ట్ర ప్రభుత్వం.

దాంతో ఆయా శాఖల మంత్రులు ఇదేం తలనొప్పులు అంటూ తలలు పట్టుకోవాల్సిందేనట. ఇప్పుడు ఇదే టెన్షన్ నెలకొంది ఏపీలో. కొత్త ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఎదుర్కొనేది మామూలు సవాల్ కాదు చాలా పెద్ద సవాల్ అని చెప్పుకోవాలి.

రవాణా వ్యవస్థ స్థంభించిపోయే అంశం. ఇప్పటికే ఏపీలో ఆయా యూనియన్ సంఘాలు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు సమ్మె నోటీస్ జారీ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 22 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం చెప్పని పక్షంలో సమ్మెకు దిగడం అనివార్యం.

సమ్మె నోటీస్ ఇవ్వడంతో అటు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ కీలక నేత, మాజీరవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణల వెన్నులో వణుకు పడుతోందట. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆర్టీసీలో ఉన్న సమస్యలు, నష్టాలపై తీవ్రఆందోళనతో ఉన్నారట.

2013 పీఆర్సీ పెంచుతున్నట్లు కేబినెట్ లో తీర్మానం చేయించేందుకు ఆయన తల ప్రాణం కాస్త తోకలోకి వచ్చిందట. అంతేకాదు ఆర్టీసీలో నిత్యం నష్టాల మాటే వినాలే తప్ప లాభాల మాట ఎప్పుడు వింటామో అనే పరిస్థితి.

దీంతో ఆయన ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సమ్మె నోటీసులు ఎలాగూ ఇచ్చేశారు. అదే శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నను మీరే ఆశాఖ ఈసారి కూడా చూడండి అని చంద్రబాబు ఎక్కడ అంటారోనని వణికిపోతున్నారట. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కీలక మంత్రి పదవి వస్తుందని ఆయన ధీమాతో ఉన్నారట.

అయితే సమ్మె నోటీస్ ఎఫెక్ట్ తో తన ఆశలకు ఎక్కడ గండిపడుతుందోనని ఆందోళన చెందుతున్నారట. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత బొత్స సత్యనారాయణ. గతంలో బొత్స సత్యనారాయణ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.

ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి వర్గంలో కీలక పదవి కొట్టేద్దామని ఆయన ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయం తర్వాత నుంచే సమ్మెకు వెళ్లే ఛాన్స్ ఉండటంతో గతంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోండంటూ జగన్ ఎక్కడ అంటారేమోనని బొత్స భయాందోళన చెందుతున్నారట.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అవుదామని బొత్స ప్రయత్నించారు. అయితే ఆయన ఆశలకు గండికొట్టేశారు వైఎస్ షర్మిల, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు. పోనీ మంత్రి వర్గంలోనైనా కీలక పొజిషలన్ లో ఉందామని భావిస్తే ఆర్టీసీ సమ్మెతో రవాణా శాఖ ఎక్కడ కేటాయిస్తారోనని ఆందోళన చెందుతున్నారట. మరి ఆర్టీసీ సమ్మె సైరన్ ఎవరికి చుక్కలు చూపిస్తుందో వేచి చూడాలి.

loader