Andhra Pradesh లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా హేతుబద్ధీకరణ మార్గదర్శకాలను జారీ చేసింది. 2025 మే 31 నాటికి ఐదేళ్ల సేవ పూర్తిచేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

సొంత గ్రామంలో పోస్టింగ్ వద్దు
ప్రభుత్వం స్పష్టం చేసిన మరో ముఖ్యాంశం – ఏ ఉద్యోగికైనా సొంత మండలం లేదా గ్రామంలో పోస్టింగ్ ఇవ్వకూడదు.భార్యాభర్తలు ఇద్దరూ సచివాలయ ఉద్యోగులుగా ఉన్నట్లయితే, ఒకే ప్రాంతంలో పోస్టింగ్ కోసం వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది.
బదిలీ ప్రక్రియకు గడువు
బదిలీ ప్రక్రియకు గడువు – జూన్ 30 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను జూన్ 30లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
క్లస్టర్లుగా విభజన
క్లస్టర్లుగా విభజన – కొత్త విధానం పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు, గ్రామ, వార్డు సచివాలయాలను క్లస్టర్లుగా విభజించే పనిలో ప్రభుత్వం ఉంది.అంతేకాక, ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ కూడా బదిలీలతో సమాంతరంగా జరుగనుంది.
సచివాలయ ఉద్యోగుల సంఖ్య – కొత్త పద్దతి ప్రకారం
సచివాలయ ఉద్యోగుల సంఖ్య – కొత్త పద్దతి ప్రకారం: 'A' కేటగిరీ సచివాలయం – 6 మంది ఉద్యోగులు,'B' కేటగిరీ సచివాలయం – 7 మంది ఉద్యోగులు,'C' కేటగిరీ సచివాలయం – 8 మంది ఉద్యోగులు మిగిలిన ఉద్యోగులను ఇతర శాఖలలో సర్దుబాటు చేస్తారు.
80 శాతం మంది ఉద్యోగులకు బదిలీ
80 శాతం మంది ఉద్యోగులకు బదిలీ 2024 సెప్టెంబర్‌లో జరిగిన సాధారణ బదిలీల్లో ఇప్పటిదాకా కేవలం 20 శాతం ఉద్యోగులకే కౌన్సెలింగ్ ద్వారా బదిలీ జరిగింది. తాజాగా ఇక 80 శాతం మందికి పైగా ఉద్యోగులను బదిలీ చేయనున్నట్టు సమాచారం