MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Local Body Elections: ఏపీలో ఎన్నికల రచ్చ.. 50,815 నామినేషన్లు ఓకే.. ఫైనల్ పోరులో నిలిచేది ఎవరు?

AP Local Body Elections: ఏపీలో ఎన్నికల రచ్చ.. 50,815 నామినేషన్లు ఓకే.. ఫైనల్ పోరులో నిలిచేది ఎవరు?

AP MPTC ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 50,815 నామినేషన్లు చెల్లుబాటు కాగా, నవంబర్ 3న పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 26 2026, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బరిలో 50,815 మంది అభ్యర్థులు.. ఎన్నికల హీట్ పెంచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ఫైట్
Image Credit : chatgpt

బరిలో 50,815 మంది అభ్యర్థులు.. ఎన్నికల హీట్ పెంచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ఫైట్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రచ్చ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో పొలిటికల్ హీట్ అప్పుడే పీక్స్‌కు వెళ్లిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఘట్టం పూర్తవడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

నామినేషన్ల స్క్రీనింగ్ పూర్తయ్యాక రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన నామినేషన్లలో ఏకంగా 50,815 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. నవంబర్ 3న జరగబోయే ఈ పోరు కోసం అభ్యర్థులు భారీ ఎత్తున పోటీ పడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏ పార్టీ నుంచి ఎంతమంది.. మైండ్ బ్లాకింగ్ నంబర్స్
Image Credit : X/Janasena Party

ఏ పార్టీ నుంచి ఎంతమంది.. మైండ్ బ్లాకింగ్ నంబర్స్

ఈ సారి పరిషత్ పోరులో ప్రధాన పార్టీలన్నీ తమ సత్తా చాటేందుకు రెడీ అయిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 46,045 నామినేషన్లు చెల్లుబాటు కాగా.. 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లు ఓకే అయ్యాయి. పార్టీల వారీగా లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

ఎంపీటీసీ స్థానాల నామినేషన్ల వివరాలు:

  • తెలుగుదేశం పార్టీ: 19,760
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: 17,726
  • జనసేన పార్టీ: 4,330
  • భారతీయ జనతా పార్టీ: 1,049

జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల వివరాలు:

  • తెలుగుదేశం పార్టీ: 1,693
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: 1,445
  • జనసేన పార్టీ: 587
  • కాంగ్రెస్ పార్టీ: 316
  • భారతీయ జనతా పార్టీ: 227
36
కూటమిలో టికెట్ల పజిల్.. సీట్ల సర్దుబాటుపై కసరత్తు
Image Credit : iTDP Official/x

కూటమిలో టికెట్ల పజిల్.. సీట్ల సర్దుబాటుపై కసరత్తు

అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఇంకా అధికారికంగా సీట్ల సర్దుబాటు క్లియర్ కాలేదని సమాచారం. దీంతో పొత్తులో సీటు ఎవరికి వస్తుందో తెలియక మూడు పార్టీల నుంచి ఆశావహులు భారీగా నామినేషన్లు వేసేశారు. ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగితే ఇబ్బంది అని భావిస్తున్న కూటమి అగ్రనేతలు.. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు సయోధ్య ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉపసంహరణ సమయానికి ఒకే అభ్యర్థి బరిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

46
అప్పీళ్లు, విత్‌డ్రాయల్స్ ఎప్పుడు?
Image Credit : X/YSRCP

అప్పీళ్లు, విత్‌డ్రాయల్స్ ఎప్పుడు?

రిజెక్ట్ అయిన నామినేషన్లపై అప్పీల్ చేసుకోవడానికి అధికారులు సమయం ఇచ్చారు. ఎంపీటీసీ అభ్యర్థులు సంబంధిత ఆర్‌డీవో వద్ద, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా కలెక్టర్ ఎదుట అక్టోబర్ 25న తమ అప్పీళ్లను అందజేశారు. ఈ అప్పీళ్లపై అప్పీలేట్ అథారిటీ అక్టోబర్ 26న తుది నిర్ణయాన్ని వెలువరించనుంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 27 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అదే రోజు సాయంత్రానికి ఫైనల్ కాంటెస్టెంట్స్ లిస్ట్ విడుదలవుతుంది. ఇక నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనుండగా, అవసరమైన చోట్ల నవంబర్ 4న రీపోలింగ్ జరుపుతారు. అక్టోబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు సమాచారం. 28 జిల్లా పరిషత్ పరిధిలోని సుమారు 2.81 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

56
వైజాగ్ మేయర్ రేస్: ముక్కా శ్రావణి vs వరుదు కళ్యాణి
Image Credit : @ChVamsiYadav

వైజాగ్ మేయర్ రేస్: ముక్కా శ్రావణి vs వరుదు కళ్యాణి

మరోవైపు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం పోరు ఉత్కంఠగా మారింది. విశాఖ మేయర్ పదవి పోటీకి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని రిటర్నింగ్ అధికారి దయానిధి తెలిపారు. మొత్తం 29 నామినేషన్లు దాఖలవగా, అందులో 8 తిరస్కరణకు గురయ్యాయి. పరిశీలన తర్వాత మిగిలిన 21 నామినేషన్లలో ఆరుగురు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం టీడీపీ నుంచి ముక్కా శ్రావణి, వైసీపీ నుంచి వరుదు కళ్యాణి రంగంలోకి దిగడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరూ ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

66
మున్సిపల్ వర్సెస్ పరిషత్.. పోలింగ్ తేదీల్లో మార్పు ఉండేనా?
Image Credit : Asianet News

మున్సిపల్ వర్సెస్ పరిషత్.. పోలింగ్ తేదీల్లో మార్పు ఉండేనా?

రాష్ట్రంలో నగర స్థానిక సంస్థల ఎన్నికలకు నవంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న వాటి ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఇదే నవంబర్ 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ జరపాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల లెక్కింపు, పరిషత్ ఎన్నికల పోలింగ్ ఒకే రోజు రావడంతో భద్రత, అధికారుల సర్దుబాటు దృష్ట్యా పరిషత్ పోలింగ్ తేదీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎన్నికల సంఘం నుంచి త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తిరుపతి
విశాఖపట్నం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cyclone Alert: అర్నబ్ తుపాను ముప్పు.. ఏపీలో 12 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. తెలంగాణకు బిగ్ అలర్ట్
Recommended image2
మేనకోడలిపై ప్రేమ ఉన్నా.. బెంగ‌ళూరులో పెళ్లి వ‌ద్దు. ష‌ర్మిల‌కు జ‌గ‌న్ బ‌హ‌రింగ లేఖ
Recommended image3
Now Playing
CM Chandrababu Unbelievable Comments | YS Jagan | AP Localbody Elections 2026 | Asianet Telugu
Related Stories
Recommended image1
LIC: ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లు కడితే చాలు జీవితాంతం అకౌంట్‌లోకి డబ్బులు
Recommended image2
Bullet Train India: సముద్రం అడుగున దూసుకెళ్లే బుల్లెట్ రైలు.. రూట్ మ్యాప్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved