MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • AP High Court: ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఏమందంటే?

AP High Court: ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఏమందంటే?

AP High Court: పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అంశంపై వైసీపీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదేంటో చూసేద్దాం. 

2 Min read
Author : Pavithra D
Published : Oct 10 2025, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ) పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం
Image Credit : AP High Court Twitter

పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ) పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల నిర్మాణంపై రాజకీయ వివాదం రాజుకుంది. పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌(పీపీపీ)లో పలు మెడికల్ కాలేజీలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ.. హైకోర్టు మెడికల్ కాలేజీల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం పిలిచిన టెండర్లపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైసీపీ వ్యతిరేకం..
Image Credit : AP High Court

వైసీపీ వ్యతిరేకం..

పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నిరసనగా విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు గురువారం రోడ్డు షో నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు పరోక్షంగా ఆయన వైఖరిని తప్పుబడుతూ.. ప్రభుత్వాన్ని సమర్ధించింది. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మిస్తే తప్పేంటని ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి చీమలపాటి రవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

35
అలా నిర్మిస్తే తప్పేంటి.?
Image Credit : AP High Court Twitter

అలా నిర్మిస్తే తప్పేంటి.?

'నిధుల కొరత కారణంగా ప్రభుత్వం ఈ పీపీపీ విధానాన్ని ఎంచుకుంటే, దానిలో తప్పేంటి.?' రాష్ట్రంలో పూర్తిగా ఆస్పత్రులు, కళాశాలలు సొంతంగా నిర్మించాల్సి వస్తే.. దానికి సంవత్సరాలు పట్టొచ్చు. ప్రభుత్వ-ప్రైవేటు భావస్వామ్యం ఓ ఆచరణాత్మక పరిష్కారం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రుణాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ బ్యాంకులను సంప్రదించలేదని.. నిధుల కొరత కారణంగా అనేక జిల్లా కోర్టు సముదాయాలు అసంపూర్ణంగా ఉన్నాయని తెలిపింది.

45
టెండర్ ప్రక్రియపై నో స్టే
Image Credit : AP High Court Twitter

టెండర్ ప్రక్రియపై నో స్టే

పూర్తి ప్రైవేటీకరణ కంటే ఇలా పీపీపీ మోడల్ ప్రభుత్వ భాగస్వామ్యం జవాబుదారీతనాన్ని, ప్రజా పర్యవేక్షణ ఉండేలా చేస్తుందని కోర్టు పేర్కొంది. అందుకే ఈ పద్దతి వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ ప్రక్రియపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. సెప్టెంబర్ 9, 2025న జారీ చేసిన ప్రభుత్వ జీవో. 590ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన డాక్టర్ కుర్రా వసుంధర దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ప్రతిస్పందనగా ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

55
జీవో వివరాలు ఇవే..
Image Credit : AP High Court Twitter

జీవో వివరాలు ఇవే..

పీపీపీ పద్దతిలో ఆదోని, మదనపల్లె, మార్కాపూర్, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలలో కొత్త వైద్య కళాశాలల స్థాపనకు కూటమి ప్రభుత్వం జీఓకు ఆమోదం తెలిపింది. కాగా, ఈ పిటిషన్‌పై ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్లను డీటెయిల్డ్ కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను అక్టోబర్ 29కు వాయిదా వేసింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ
నారా చంద్రబాబు నాయుడు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాను.. జిల్లాల్లో కుండపోత వర్షాలు
Recommended image2
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image3
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Related Stories
Recommended image1
AP Inter Exam Timetable : ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23 నుంచి ఎగ్జామ్స్
Recommended image2
AP Cabinet: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved