MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక అన్నీ ఉచితంగానే..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక అన్నీ ఉచితంగానే..!

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల బస పొడిగింపు, కాగ్నిజెంట్‌కు భూమి, సంసిద్ధత శిక్షణ, ఆర్టీఐహెచ్ స్పోక్‌ సెంటర్లు ఏర్పాటు వంటి నాలుగు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 03 2025, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉద్యోగుల సంక్షేమం
Image Credit : social media

ఉద్యోగుల సంక్షేమం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ నాలుగు కీలక రంగాల్లో సమగ్ర చర్యలు ప్రారంభించింది. వీటిలో ఉద్యోగుల సంక్షేమం, ఐటీ రంగం, విద్యా పురోగతి, పరిశోధనల ప్రోత్సాహం ప్రధానంగా ఉన్నాయి.

26
ఉచిత బస సదుపాయం మరో ఏడాది
Image Credit : our own

ఉచిత బస సదుపాయం మరో ఏడాది

ఉద్యోగులకు ఉచిత బస సదుపాయం మరో ఏడాది పాటు పొడిగింపు: అమరావతిలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత బస కల్పిస్తోంది. ఈ సదుపాయం గడువు 2024 జూన్ 27తో ముగియగా, తాజాగా 2026 జూన్ 26 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

Related image1
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే ఛాన్స్‌.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు
Related image2
Andhra Pradesh లో ఆ ఉద్యోగులకు ఏకంగా 13 వేల రూపాయాల జీతం పెంపు!
36
కాగ్నిజెంట్‌కు విశాఖలో భూమి
Image Credit : our own

కాగ్నిజెంట్‌కు విశాఖలో భూమి

కాగ్నిజెంట్‌కు విశాఖలో భూమి కేటాయింపు: ఐటీ రంగ అభివృద్ధిలో భాగంగా మధురవాడలో 22.19 ఎకరాల భూమిని కాగ్నిజెంట్ సంస్థకు 99 పైసల లీజు రేటుతో కేటాయించారు. సంస్థ 2026 జూన్ నాటికి 500 మందికి ఉపాధి కల్పించే క్యాంపస్‌ను ప్రారంభించనుంది. మొత్తం రూ.1,582 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాల లక్ష్యంగా పని చేయనుంది.

46
పాఠశాలల్లో ‘సంసిద్ధత’ శిక్షణ
Image Credit : Business Today

పాఠశాలల్లో ‘సంసిద్ధత’ శిక్షణ

పాఠశాలల్లో ‘సంసిద్ధత’ శిక్షణ కార్యక్రమం: 1వ తరగతి నుంచి 6వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇది విద్యార్ధుల్లో పునాది విద్యా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా సాగనుంది.

56
ఆర్టీఐహెచ్ స్పోక్‌ సెంటర్ల ఏర్పాటు
Image Credit : google

ఆర్టీఐహెచ్ స్పోక్‌ సెంటర్ల ఏర్పాటు

ఆర్టీఐహెచ్ స్పోక్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు: టాటా ట్రస్ట్ భాగస్వామ్యంతో అమరావతిలో ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, అనంతపురం, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నాల్లో స్పోక్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు వీటి నిర్వహణ బాధ్యతలు చేపడతారు.

66
హబ్‌ల పనితీరు
Image Credit : Social Media

హబ్‌ల పనితీరు

ప్రభుత్వం తెలిపిన ప్రకారం, జేసీలు ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు భాగస్వామ్య సంస్థలతో సమన్వయం చేస్తారు. అభివృద్ధికి తోడ్పడేలా హబ్‌ల పనితీరును పర్యవేక్షించే బాధ్యతను వారు నిర్వహిస్తారు.ఈ చర్యలన్నీ ఏపీ ప్రభుత్వం ఒకేసారి ప్రకటించడం విశేషం. ఉద్యోగుల సంక్షేమం నుంచి విద్యార్ధుల చదువుల సౌలభ్యం వరకు, ఐటీ రంగంలో పెట్టుబడులు, పరిశోధనలకు మద్దతు వంటి విభిన్న రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న సమన్విత చర్యలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కనిపిస్తున్నాయి.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Pemmasani Chandrasekhar:పోస్టల్ డెలివరీలను 24గంటల్లో పూర్తిచేయడమే దీని లక్ష్యం | Asianet News Telugu
Recommended image2
Now Playing
Nara Lokesh Speech: మంగళగిరి మయూరీ టెక్ పార్క్‌లో APEDB కార్యాలయం ప్రారంభం | Asianet News Telugu
Recommended image3
Now Playing
Minister Nara Lokesh Conducts Surprise Inspection at Mylavaram School | Asianet News Telugu
Related Stories
Recommended image1
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే ఛాన్స్‌.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు
Recommended image2
Andhra Pradesh లో ఆ ఉద్యోగులకు ఏకంగా 13 వేల రూపాయాల జీతం పెంపు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved