MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • ఆ పోలీస్ కుటుంబాలకు అండగా నిలవండి..: పోలీసులతో డీజీపీ సవాంగ్

ఆ పోలీస్ కుటుంబాలకు అండగా నిలవండి..: పోలీసులతో డీజీపీ సవాంగ్

పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో డిజిపి గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రతి పోలీస్ అండగా వుండాలని సూచించారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 29 2021, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కోవిడ్ సమయంలో భయంతో ప్రజలంతా ఇళ్లల్లో ఉంటే, ఒక్క పోలీసు మాత్రమే రోడ్డు మీద నిలబడి ప్రజల ప్రాణాలను కాపాడారని తెలంగాణ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో 206 మంది పోలీసులు కరోనాబారిన పడి ప్రాణాలు కోల్పోయారని డిజిపి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరులకు నివాళులర్పించడంతో పాటు, మనకు దూరమైన సాటి పోలీసు కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు డిజిపి సవాంగ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఏపీ పోలీస్ బ్యాండ్ డిస్ ప్లే నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందజేసిన బ్యాంకు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిథులకు ప్రసంశ పత్రాలు అందజేశారు.
 

38

కోవిడ్ సమయంలో 24X7 హెల్ప్ లైన్ తో పోలీసు కుటుంబాలకు వైద్య సేవలు అందించిన ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ సతీమణి సుమిత్రా రవిశంకర్, వారి టీమ్ ను ప్రత్యేకంగా goutham sawang అభినందించారు. పోలీసు కుటుంబానికి చెందిన వ్యక్తిగా sumitra ravishankar అందించిన సేవలు చాలా గొప్పవని ఆయన కొనియాడారు.
 

48

విధి నిర్వహణలో ఎంతో బాధ్యతతో వ్యవహారించే పోలీసులు ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిలబడే తమ విధులు నిర్వహిస్తారని ప్రశంసించారు. ముఖ్యంగా మహిళా పోలీసులు పనిచేసే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని.. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని పనిచేయాల్సి ఉంటుందన్నారు. అదే సమయంలో పోలీసులుపై అనేక అంచనాలు ప్రజలకు ఉంటాయని... వాటిని అందుకునే విధంగా పనిచేయాలన్నారు. 

58

ఒకవైపు సమాజాన్ని రక్షిస్తూనే, మరోవైపు కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంటుందన్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సమాజం కోసం పోలీసులు వారి కుటుంబాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కూడా వస్తాయన్నారు. పోలీసులు వెనుక వారి కుటుంబాలు అండగా ఉండటం వల్లనే ఎటువంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగలుగుతున్నారని... మన కోసం త్యాగం చేసిన కుటుంబాలను ఎలా కాపాడుకోవాలనేది కూడా ఆలోచించాలన్నారు. 

68

పోలీసు అమరవీరుల కుటుంబాలకు మద్దతుగా నిలిచి, వారికి భరోసా ఇవ్వాల్సిన బాద్యత పోలీసులందరిపైనా ఉందన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని సందర్భాల్లో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. కోవిడ్ సమయంలో అన్ని వ్యవస్థలు స్థంభించుకుపోయినా పోలీసు ఒక్కడే రోడ్లమీద ఒంటరిగా నిలబడి సమాజానికి రక్షణగా నిలబడ్డాడని తెలిపారు. ఈ క్రమంలో 206 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. 

78

బ్యాండ్ లు అనేవి మన సంస్కృతిలో భాగం, మన సంస్కృతికి చిహ్నాలని, వాటిని కాపాడుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.   గతంలో రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వంటి కార్యక్రమాలకు కూడా సరైన బ్యాండ్ లు ఉండేవి కాదని.. అందుకే 2014 లో 20 మందితో ఏపీ పోలీసు బ్యాండ్ ప్రారంభించామన్నారు. నేడు ఏపీ పోలీసు బ్యాండ్ డిస్ ప్లే కార్యక్రమంలో బ్రాస్, పైప్ బ్యాండ్ లు మంచి ప్రదర్శన ఇచ్చాయని, అందరిలో ఉత్సాహాం, ఆనందం రెకేత్తించేలా బ్యాండ్ ప్రదర్శన ఉందని ఆయన కొనియాడారు. 

88

గత ఏడాది పైప్ బ్యాండ్ ను ప్రారంభించామని... నేడు వారి ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారని, భవిష్యత్తులో బ్యాండ్ లు మరింత సమర్ధవంతంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, సీనియర్ ఐపీఎస్ అధికారులు సురేంద్రబాబు, అనురాధ, పోలీసు వెల్ఫేర్ ఓఎస్డీ రామకృష్ణ, పీ అండ్ ఎల్ నాగేంద్రకుమార్, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విజయవాడ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved