కోటి రూపాయలతో అంతర్వేది నూతన రథం... స్వయంగా లాగి ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)

First Published Feb 19, 2021, 8:45 PM IST

శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం జగన్‌ దర్శించుకున్నారు.  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇటీవల దగ్దమైన రథం స్థానంలో కొత్తగా కోటి రూపాయలతో  నిర్మించిన రథాన్ని ప్రారంభించారు. సీఎంతో పాటు మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.