రూ.200కోట్లతో తిరుమలలో భారీ వసతి గృహం... భూమిపూజలో యడియూరప్ప, జగన్ (ఫోటోలు)
తిరుమలలో కర్ణాటక సత్రాల భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ తో పాటు కర్ణాటక సీఎం యడియూరప్ప పాల్గొన్నారు. రూ.200 కోట్లతో వసతి గృహ సముదాయాలను కర్ణాటక ప్రభుత్వం నిర్మించనుంది. రోజుకు 18 వందలమంది బస చేసేందుకు వీలుగా గృహ సముదాయాల నిర్మాణం జరగనుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే తమ రాష్ట్రానికి చెందిన భక్తుల సౌకర్యార్థం కర్ణాటక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ భవనాన్ని నిర్మిస్తోంది.
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి యడియూరప్ప తీసుకువెళుతున్న జగన్
తిరుమలకు విచ్చేసిన యడియూరప్పకు జ్ఞాపిక అందజేస్తున్న జగన్
తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అతిధి గృహ సముదాయ శిలాపలక ఆవిష్కరణలో ఇరువురు సీఎంలు
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్ కు తిరునామాలు పెడుతున్న అర్చకులు
యడియూరప్పతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్న జగన్, యడియూరప్ప
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప