MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ..వాట్సాప్ ఉంటే చాలు!

Andhra Pradesh: కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ..వాట్సాప్ ఉంటే చాలు!

ఆంధ్రప్రదేశ్‌లో వాట్సప్ ద్వారా ఆస్తి పన్ను, నీటి బిల్లులు చెల్లించే అవకాశం. అక్టోబరు నుంచి అన్ని పంచాయతీల్లో అందుబాటులోకి  ఈ కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది.

2 Min read
Author : Bhavana Thota
Published : Jun 30 2025, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'మనమిత్ర
Image Credit : AI and freepic photo

'మనమిత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు 'మనమిత్ర' పేరుతో ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు పన్నులు, బిల్లులు చెల్లించేందుకు మీసేవ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, వాట్సప్‌ యాప్‌ ద్వారా మొబైల్‌ఫోన్ నుంచే ఈ సేవలను పొందే వీలున్నందున, ఇది గ్రామీణ ప్రజలకు ఒక పెద్ద సౌకర్యంగా మారనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆస్తి వివరాలు, బకాయిలను
Image Credit : AI Photo

ఆస్తి వివరాలు, బకాయిలను

ప్రజలు తమ వాట్సప్‌లో “Hi” అనే సందేశాన్ని ‘మనమిత్ర’ నంబర్‌కు పంపితే, పన్నులు, బిల్లులు చెల్లించేందుకు అవసరమైన లింకులు వస్తాయి. అక్కడి నుంచి పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ఆధారంగా లాగిన్ అయ్యి, తమ ఆస్తి వివరాలు, బకాయిలను తెలుసుకుని, డెబిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు పూర్తయిన వెంటనే వాట్సప్‌లోనే రసీదు వస్తుంది.

35
డిజిటల్ చెల్లింపు మార్గాలను
Image Credit : ANI

డిజిటల్ చెల్లింపు మార్గాలను

ఇప్పటికే రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో సుమారు రూ.822.46 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. అయితే చాలా మంది ఆస్తి యజమానులు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న నేపథ్యలో పన్ను చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డిజిటల్ చెల్లింపు మార్గాలను ప్రోత్సహిస్తోంది.

45
వాట్సప్‌ ఆధారిత సేవలు
Image Credit : Pexels

వాట్సప్‌ ఆధారిత సేవలు

అక్టోబరు 2025 నుంచి ఈ వాట్సప్‌ ఆధారిత సేవలు అన్ని గ్రామ పంచాయతీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇది గ్రామీణ పాలనలో డిజిటలైజేషన్‌కు దారితీసే కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఇకపై పౌరులు ఎక్కడినుండైనా తమ ఆస్తులకు సంబంధించి బిల్లులను సకాలంలో చెల్లించగలుగుతారు.

ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి ప్రారంభమైన డిజిటల్ ఇండియా ప్రయోగం మరింత విస్తృత స్థాయిలో విస్తరించనుందని అధికారులు తెలిపారు.

55
ప్రభుత్వ ఆదాయం
Image Credit : Pexels

ప్రభుత్వ ఆదాయం

ఈ కొత్త విధానం వలన అవినీతి అవకాశాలు తగ్గుతాయని అధికారులు విశ్వసిస్తున్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందనే ఆశ ఉంది. గతేడాది ప్రారంభమైన 'స్వర్ణ పంచాయతీ' పోర్టల్‌ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించే విధానం వల్ల ఇప్పటికే పన్నుల వసూలు స్థాయిలో మెరుగుదల కనిపించింది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AP Local Body Elections 2026 : మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు... ఎక్కడ, ఎవరికి అవకాశమో తెలుసా?
Recommended image2
Rice: డీమార్ట్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
Recommended image3
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
Related Stories
Recommended image1
Andhra Pradesh : లక్ష కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు : ఏపీ భవిష్యత్ నే మార్చేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Recommended image2
Andhra Pradesh: ఏపీలో ఉచిత బ‌స్సు ప్రయాణం.. తెలంగాణ కంటే భిన్నంగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved