చిరంజీవితో సోమువీర్రాజు భేటీ : నాగబాబుకు ఎమ్మెల్సీ..?

First Published 8, Aug 2020, 9:50 AM

బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు వరుస భేటీలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన చిరంజీవిని కలిసాడు. ఆ తరువాతి రోజే పవన్ కళ్యాణ్ ని కూడా కలిసాడు. వీరిద్దరిని ఆయన కలవడం, ఇద్దరు కూడా కాపు నేతలవడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి రంజు మీద ఉన్నాయి. మూడు రాజధానుల అంశం పై కోర్టు స్టే విధించడం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి ఎన్నికల కమీషనర్ గా విధులు చేపట్టడం(ఎన్నికల కమీషనర్ రాజ్యాంగబద్ధ పదవి అయినప్పటికీ.... టీడీపీ, వైసీపీలు ఆ విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో... దానికి రాజకీయ రంగు పులుముకుంది)

బీజేపీకి తాజాగా నూతన అధ్యక్షుడు రావడంతో బీజేపీ సైతం హడావుడి చేస్తుంది. రాష్ట్రంలో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా బీజేపీ జనసేనతో పొత్తుపెట్టుకుంది. పవన్ కళ్యాణ్, జనసేన కలిసి ప్రయాణం చేస్తూ రాజకీయాల్లో నూతన శక్తిగా ఆవిర్భవించే ప్రయత్నం చేస్తుంది.

ఇకపోతే బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు వరుస భేటీలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన చిరంజీవిని కలిసాడు. ఆ తరువాతి రోజే పవన్ కళ్యాణ్ ని కూడా కలిసాడు. వీరిద్దరిని ఆయన కలవడం, ఇద్దరు కూడా కాపు నేతలవడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ అటు టీడీపీతోను, ఇటు వైసీపీతోను సమదూరాన్ని పాటిస్తుంది. ఒక విషయంలో వైసీపీకి సహాయం చేస్తే మరో అంశంలో టీడీపీకి సహాయం చేస్తుంది. కానీ మూడు రాజధానుల అంశంలో బీజేపీ తీసుకున్న నిర్ణయంతో టీడీపీ ఒకరాకంగా షాక్ కి గురయినట్టుగా చెప్పవచ్చు.

కోర్టులో కేంద్రం తమకు ఈ మూడు రాజధానుల విషయంలో సంబంధం లేదు అనే అఫిడవిట్ దాఖలు చేయడం, దానికి ముందు జరిగిన పరిణామాలను గమనిస్తే వైసీపీ ఈ విషయంలో కేంద్రానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్టుగానే కనబడుతుంది.

రాష్ట్రంలో బీజేపీ, జనసేన బలంగా జండా పాతాలని అనుకుంటున్నప్పటికీ... వారికి ఎమ్మెల్యేలు లేరు. జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ లేనట్టే! బీజేపీకి అయినా కనీసం ఎమ్మెల్సీలన్నా ఉన్నార,. జనసేనకు వారు కూడా లేరు. ప్రజాప్రతినిధ్యం లేకుండా పోయిందనే భావన జనసేనలో బలంగా కనబడుతుంది.

ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ బీజేపీ చెబితే వింటుందనేది జగమెరిగిన సత్యం. పరిమల్ నత్వానికి రాజ్యసభ సీటును బీజేపీ ఇప్పించుకుంది కూడా ఇలానే. ముఖేష్ అంబానీ వచ్చి చర్చలు జరిపినప్పటికీ.... బ్యాక్ గ్రౌండ్ లో బీజేపీ పెద్దల హస్తం ఉందనేది బహిరంగ రహస్యం.

ఇక ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు టీడీపీ పై విమర్శనాస్త్రాలను ఎక్కువగా ఎక్కుపెట్టారు. మీకు జగన్ ఏ కరెక్ట్ అనడం దగ్గరినుండి రాష్ట్రంలో వైసీపీ అయినా తిరిగి అధికారంలోకి వస్తుంది కానీ... టీడీపీ మాత్రం ఎప్పటికీ రాదూ వంటి వ్యాఖ్యలు చేసాడు. బాలకృష్ణపై సైతం విమర్శలను గుప్పిస్తున్నారు.

జనసేన వర్గాల్లోని కొందరు ఈ అన్ని పరిస్థితులను సమీక్షించిన తరువాత నాగబాబుకు జనసేన తరుఫున ఒక ఎమ్మెల్సీ సీటును ఇప్పించాలనియు పవన్ కళ్యాణ్ తలుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో కేంద్రం సహాయ సహకారాలను అందించినందుకు ఈ సీటును దక్కించుకోనున్నట్టు టాక్.

చిరంజీవి తెరవెనుక ఉంది ఇదంతా ప్లాన్ చేసారని. తమ్ముడికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోగలగడంతోపాటుగా బీజేపీతో మైత్రి సైతం కొనసాగించగలుగుతారు. ఈ చర్య వల్ల పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనకు సైతం చట్టసభలో ఒక ప్రాతినిధ్యం దక్కుతుంది. చిరంజీవి ఇకమీదట జనసేన, వైసీపీల మధ్య వారధిగా ఉండనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. వేచి చూడాలి ఇది నిజమే అవుతుందా, మరో వదంతిగా మిగిలిపోతుందా అని..!

loader