- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి...చాలా సింపుల్!
Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి...చాలా సింపుల్!
ఏపీ ప్రభుత్వం రూ.7వేలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. అర్హతలపై క్లారిటీతో పాటు, ఫిర్యాదుల కోసం జులై 5 నుంచి గ్రీవెన్స్ మాడ్యూల్ అందుబాటులోకి వస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అన్నదాత సుఖీభవ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయంగా అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటనలు చేసింది. కేంద్రం పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ చేసే రోజే, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.5వేలు కలిపి మొత్తం రూ.7వేలు ఒక్కో రైతు ఖాతాలోకి పంపించనుంది. దీనికి సంబంధించిన అర్హుల జాబితా ఇప్పటికే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.
రైతు సేవా కేంద్రాల్లో
ఈ పథకానికి సంబంధించిన సాంకేతిక సమస్యలు లేదా అర్హతలో అనుమానాలు ఉన్న రైతుల కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జులై 5వ తేదీ నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ మాడ్యూల్ అందుబాటులోకి వస్తోంది. డేటాలో లోపాలు, పేర్ల తేడాలు, లేదా హక్కుదారుల సమాచారం లేనివాటిని పరిష్కరించేందుకు ఈ మాడ్యూల్‌ను ఉపయోగించనున్నారు.
Check Status’ అనే ఆప్షన్
వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వివరించిన ప్రకారం, రైతులు తమ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అర్హతను సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లో ‘Check Status’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఆధార్ నంబర్ నమోదు చేసి, కాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే తాము అర్హులలో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవచ్చు.
రైతు సేవా కేంద్రంలో
అర్హత లేనివారు లేదా అర్హతపై సందేహాలు ఉన్నవారు వ్యవసాయ సహాయకులను సంప్రదించవచ్చు లేదా 155251 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అదనంగా, రైతు సేవా కేంద్రంలో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అక్కడ ఉన్న సిబ్బంది ఫిర్యాదులను పోర్టల్‌లో నమోదు చేస్తారు.
టెక్నికల్ సమస్యల వల్ల
ఒకవేళ భూమి యజమాని మృతిచెందిన తర్వాత వారసుల పేర్లను వెబ్‌ల్యాండ్, అడంగల్, 1బీ డాక్యుమెంట్లలో నమోదు చేయకపోతే, రైతు పథకాలకు అనర్హత వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి డేటా లోపాల వల్ల అసలు భూమి ఉండి కూడా అది సిస్టమ్‌లో కనిపించకుండా పోతుందనే విషయాన్ని అధికారులు గుర్తించారు. టెక్నికల్ సమస్యల వల్ల వాస్తవిక వివరాలు సరిగా నమోదు కాకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోంది.
ఆటో మ్యూటేషన్ ప్రక్రియ
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆటో మ్యూటేషన్ ప్రక్రియ జరుగుతున్న గ్రామాల్లో 5 వేల పైగా సిరీస్ ఖాతాలు నోషనల్‌గా కనిపించవచ్చునన్న హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇవన్నీ సమీక్షించి, తగిన మార్పులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రైతులు తమ అర్హత వివరాలు సరిచూసుకునేందుకు లేదా ఫిర్యాదులు చేయడానికి ఈకేవైసీ స్టేటస్ కూడా వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అంతేకాక, ఈకేవైసీ అవసరమా లేదా అనేది కూడా రైతులకు వెబ్‌సైట్‌లోనే కనిపిస్తుంది.