MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra pradesh: 11వ నెల 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు.. ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భావం

Andhra pradesh: 11వ నెల 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకు.. ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భావం

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలో తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 20 2026, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నవంబర్ 11న విజయవాడలో కొత్త పార్టీ ఆవిర్భావం
Image Credit : Vijayasai Reddy V/X

నవంబర్ 11న విజయవాడలో కొత్త పార్టీ ఆవిర్భావం

విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ ప్రకటనకు ప్రత్యేక ముహూర్తాన్ని ఖరారు చేశారు. నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రజలు, యువత తమ కొత్త రాజకీయ ప్రయాణానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పార్టీ పేరు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రెండు పార్టీల రాజకీయాలకు ప్రత్యామ్నాయమే లక్ష్యం
Image Credit : ANI

రెండు పార్టీల రాజకీయాలకు ప్రత్యామ్నాయమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, రెండు కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కులం, మతం ఆధారంగా జరిగే రాజకీయాలకు బదులుగా ప్రజల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలు లేని రాష్ట్రాన్ని నిర్మించాలన్నది తన ఆలోచనగా వివరించారు. కరువు, విద్యుత్ కోతలు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే విధంగా కొత్త పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. ఇవన్నీ ఆయన వెల్లడించిన రాజకీయ లక్ష్యాలు కాగా, వాటి అమలుకు సంబంధించిన పూర్తి ప్రణాళిక ఇంకా తెలియాల్సి ఉంది.

34
రైతులకు సాగునీరు.. యువతకు ఉద్యోగాలు
Image Credit : our own

రైతులకు సాగునీరు.. యువతకు ఉద్యోగాలు

కొత్త పార్టీ ఎజెండాలో వ్యవసాయం, విద్యుత్, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని విజయసాయిరెడ్డి వివరించారు. ప్రతి ఎకరానికి ఏడాదికి రెండు పంటలకు సరిపడా నీరు అందించడం, ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ అందించే దిశగా చర్యలు తీసుకోవడం తమ లక్ష్యాలని తెలిపారు. విద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు పెరిగేలా, వారి ఖర్చుల భారం తగ్గేలా విధానాలు రూపొందిస్తామని వెల్లడించారు. యువతను నాయకత్వంలోకి తీసుకురావడంతో పాటు కొత్త తరం రాజకీయ నాయకులను తయారు చేసే వేదికగా పార్టీని తీర్చిదిద్దాలన్న ఆలోచనను కూడా ఆయన ప్రస్తావించారు.

@JaiTDP @JanaSenaParty @BJP4India @BJP4Andhra @YSRCParty @INCIndia @cpimspeak @cpofindia

@TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu

@10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp

— Vijayasai Reddy V (@VSReddy_MP) October 20, 2026

44
గతంలో వాయిదా.. ఇప్పుడు పార్టీ ఏర్పాటుపై స్పష్టత
Image Credit : our own

గతంలో వాయిదా.. ఇప్పుడు పార్టీ ఏర్పాటుపై స్పష్టత

విజయసాయిరెడ్డి గతంలో కొత్త పార్టీ ప్రకటనను వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు. అనారోగ్య కారణాలతో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నందున ప్రకటనకు సమయం పట్టిందని ఆయన అప్పట్లో తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటుపై ఆయన వెనక్కి తగ్గారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగినప్పటికీ, తాను ఆ ప్రయత్నాన్ని విరమించుకోలేదని స్పష్టం చేశారు. తాజాగా దసరా సందర్భంగా పార్టీ ఆవిర్భావ తేదీని ప్రకటించడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి పెరిగింది. నవంబర్ 11 తేదీ, 11 గంటల 11 నిమిషాల సమయాన్ని ఎంచుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 11 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో, ఈ సంఖ్య ఎంపికపై చ‌ర్చ న‌డుస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
రాజకీయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బంగాళాఖాతంలో బలపడిన ద్రోణి.. పండగపూట కూడా వదలని వరుణుడు | Asianet News Telugu
Recommended image2
Now Playing
జగన్ vs చంద్రబాబు.. ఎవ్వరు తగ్గలేదు! 🔥 | AP Politics Latest News | YSRCP vs TDP | Asianet Telugu
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో బలపడిన ద్రోణి.. దసరా పండగపూట ఈ జిల్లాల్లో వర్షాలు
Related Stories
Recommended image1
బంగారు బిస్కెట్లపై గోల్డ్‌ లోన్ ఎందుకు ఇవ్వ‌రో తెలుసా.? అస‌లు కార‌ణం ఏంటంటే?
Recommended image2
River Water: న‌దుల్లో నీరు ఎందుకు తియ్య‌గా ఉంటాయో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved