MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh Jobs : ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్ జాబ్ ... వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు పొందండిలా!

Andhra Pradesh Jobs : ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్ జాబ్ ... వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు పొందండిలా!

ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే పలు పోస్టుల భర్తీ చేపడుతోంది ప్రభుత్వం. ఇప్పుడు మరిన్ని ఉద్యోగాలను భర్తీకి సిద్దమయ్యారు 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jan 02 2025, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
AP Staff Nurse Posts

AP Staff Nurse Posts

AP Staff Nurse Posts : ఆంధ్ర ప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జోన్ల వారిగా ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు... ఇప్పటికే జోన్ 3 కి సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 

జోన్ 3 లో మొత్తం 44 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో తెనాలి 6, బాపట్ల 10, నరసరావుపేట 24, గురజాల 1, కందుకూరు 1, ఆత్మకూరు 1, రాపూరు 1 పోస్టును భర్తీ చేపట్టారు.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
nursing jobs

nursing jobs

స్టాఫ్ నర్స్ పోస్టులకు విద్యార్హతలు :

జనరల్ నర్సింగ్ ఆండ్ మిడ్వైఫరీ (GNM) లేదా బిఎస్సి నర్సింగ్ చేసినవారు అర్హులు. 

వయో పరిమితి :

18 నుండి 42 ఏళ్లలోపు వయసుగల అభ్యర్థులు ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అర్హులు. జులై 1, 2024 నాటికీ అభ్యర్థుల వయసును పరిగణలోకి తీసుకుంటారు.

అయితే ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు వుంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కు అదనంగా మరో మూడేళ్ల సడలింపు వుంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వుంటుంది. ఇలా కనిష్ట వయో పరిమితి సడలింపు 52 ఏళ్లు.  

34

దరఖాస్తు ప్రక్రియ : 

ఏపీలోని జోన్ 3 కి ప్రాంతానికి చెందివుండి... పైన పేర్కొన్న  విద్యార్హతలు, వయసు కలిగిన  అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://cfw.ap.nic.in ను సందర్శించండి. 

అందులో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అప్లికేషన్ ఫారం వుంటుంది. అది డౌన్లోడ్ చేసుకోవాలి. 

సంబంధిత పత్రాలను జతచేసి అప్లికేషన్ ఫారంను గుంటూరులోని మెడికల్ ఆండ్ హెల్త్ సర్విసెస్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తు స్వీకరించినట్లుగా అధికారులు రసీదును అందిస్తారు. దాన్ని జాగ్రత్తగా వుంచాలి...తర్వాత భర్తీ ప్రక్రియలో ఉపయోగపడుతుంది.

ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జనవరి 15, 2025 వరకు అప్లికేషన్స్ స్వీకరిస్తారు.  జనవరి 17 నుండి 23 వరకు దరఖాస్తులను పరిశీలించి జనవరి 24న మెరిట్ లిస్ట్ ప్రచురిస్తారు. అప్పటినుండి జనవరి 27 వరకు అభ్యంతరాలను స్వీకరించి జనవరి 29న తుది మెరిట్ జాబితాను రెడీ చేస్తారు. జనవరి 30, 31 తేదీల్లో కౌన్సిలింగ్, దృవపత్రాల పరిశీలన చేపడతారు. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. 

దరఖాస్తు ఫీజు : 

ఓసి అభ్యర్థులకు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి వుంటుంది.  ఎస్సి, ఎస్టి,బిసి,ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 

ఈ దరఖాస్తు ఫీజును గుంటూరు రీజినల్ డైరెక్టర్ మెడికల్ ఆండ్ హెల్త్ సర్వీస్ పేరిట డిడి (డిమాండ్ డ్రాప్ట్) చేయాల్సి వుంటుంది. 
 

44
nurse health workers kerala

nurse health workers kerala

ఎంపిక ప్రక్రియ :  

జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇలా అకడమిక్ మార్కులు 75 శాతంగా, అనుభవానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. మరో 10 శాతం మార్కులు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని కేటాయిస్తారు.  

 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఎడాది కాలానికి కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయాల్సి వుంటుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరింత సమాచారం కోసం http://cfw.ap.nic.in వెబ్ సైట్ ను పరిశీలించండి. 

ఇవి కూడా చదవండి

తెలుగు యువతకు బంపరాఫర్ : రూ.50,000 సాలరీతో పవన్, లోకేష్ వద్ద పనిచేసే అవకాశం

Sankranti Holidays : సాఫ్ట్ వేర్, బ్యాంక్ ఉద్యోగులకూ నాలుగు రోజుల సంక్రాంతి సెలవులు


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
2nd TEST • SA vs AUS
Rain Delay
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 5 - Session 3
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(15.4 ov)169/3
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : వచ్చే సోమవారం కూడా సెలవే... ఎందుకో తెలుసా?
Recommended image2
Weather Update: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షాల అలర్ట్
Recommended image3
Now Playing
ఊహించని పని చేసిన బాబు | Vangaveeti Radha Meets CM Chandrababu | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved