MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra pradesh: ఏపీలో మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌.. రూ. 16,350 కోట్ల ప్రాజెక్టుకు చంద్ర‌బాబు శంకుస్థాప‌న

Andhra pradesh: ఏపీలో మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌.. రూ. 16,350 కోట్ల ప్రాజెక్టుకు చంద్ర‌బాబు శంకుస్థాప‌న

Andhra pradesh:  పెద్ద ఎత్తున పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తూ వ‌స్తోన్న కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా మ‌రో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఏకంగా రూ. 16,350 కోట్ల పెట్టుబ‌డి ప్రాజెక్టుకు శుక్ర‌వారం శంకుస్థాప‌న చేశారు. 

3 Min read
Author : Narender Vaitla
Published : Jul 03 2026, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాయలసీమ అభివృద్ధికి భారీ ప్రాజెక్టు
Image Credit : Andhra & Amaravati Updates/X

రాయలసీమ అభివృద్ధికి భారీ ప్రాజెక్టు

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భారీ ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమంలో విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
"రాళ్ల సీమ కాదు.. రత్నాల సీమ" అంటూ సీఎం సందేశం
Image Credit : Andhra & Amaravati Updates/X

"రాళ్ల సీమ కాదు.. రత్నాల సీమ" అంటూ సీఎం సందేశం

శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ భవిష్యత్తుపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. గతంలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాయలసీమను ఇకపై కరవు ప్రాంతంగా కాకుండా వ్యవసాయం, ఉద్యానవనం, పరిశ్రమల సమ్మేళనంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్‌తో విశాఖపట్నంతో పాటు రాయలసీమ కూడా ఉక్కు పరిశ్రమలో కీలక స్థానాన్ని సంపాదిస్తుందని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాజెక్టు పేరుతో శంకుస్థాపనలు జరిగినా పనులు ముందుకు సాగలేదని గుర్తు చేసిన సీఎం, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణతో పాటు అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టును అమలు దశకు తీసుకొచ్చిందని వివరించారు. కంపెనీకి 1,100 ఎకరాల భూమిని కేటాయించిన తర్వాత నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు.

Related Articles

Related image1
Railway: ఎంత వేగంగా వెళ్లినా రైలు పట్టాలపై ఎందుకు జారిపోదు.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.?
Related image2
Lock: ఈ తాళానికి తాళం చెవి ఉండ‌దు.. ఫింగ‌ర్ ప్రింట్‌తో ఓపెన్ అయ్యే స్మార్ట్ లాక్
35
దేశంలో తొలి గ్రీన్ స్టీల్ ప్లాంట్‌గా ప్రత్యేకత
Image Credit : Andhra & Amaravati Updates/X

దేశంలో తొలి గ్రీన్ స్టీల్ ప్లాంట్‌గా ప్రత్యేకత

జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్‌లో అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ (EAF) సాంకేతికతను వినియోగించనున్నారు. సంప్రదాయ ఉక్కు తయారీ విధానాలతో పోలిస్తే ఈ టెక్నాలజీ వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. దీంతో పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. ఈ తరహా సాంకేతికతతో నిర్మితమవుతున్న దేశంలోని తొలి ప్రధాన గ్రీన్ స్టీల్ ప్లాంట్‌గా దీనికి గుర్తింపు లభించనుంది. పరిశ్రమకు అవసరమైన విద్యుత్ అవసరాలను తీర్చేందుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో 2,400 ఎకరాల్లో 400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.

45
రెండు దశల్లో నిర్మాణం.. వేల మందికి ఉపాధి
Image Credit : Andhra & Amaravati Updates/X

రెండు దశల్లో నిర్మాణం.. వేల మందికి ఉపాధి

మొత్తం 1,100 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో ఈ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. తొలి దశలో రూ.4,800 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టి 2028 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అనంతరం రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారు. పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500 మందికి ప్రత్యక్షంగా, మరో 5,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. స్థానిక యువతతో పాటు అనుబంధ పరిశ్రమలకు కూడా ఇది పెద్ద అవకాశంగా మారనుంది.

🏗️Rayalaseema Steel Plant works commenced in presence of CM @ncbn garu & JSW Group Chairman Mr. Sajjan Jindal.

🔸CM also launched JSW Captive Solar Plant & virtually inaugurated JSW Industrial Park, Vizianagaram.#AndhraPradesh#Kadapa@TheJSWGroup@jswsteelpic.twitter.com/1aoELdRNpU

— Andhra & Amaravati Updates (@AP_CRDANews) July 3, 2026

55
రాయలసీమ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం
Image Credit : Andhra & Amaravati Updates/X

రాయలసీమ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం

ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో కేవలం ఉక్కు ఉత్పత్తి మాత్రమే కాకుండా రవాణా, లాజిస్టిక్స్, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs), నిర్మాణ రంగం, సేవల రంగాల్లో కూడా విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయి. స్థానిక వ్యాపారాలు, సరఫరా వ్యవస్థలు, ఉపాధి రంగం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంతో రాయలసీమపై పెద్ద పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాయలసీమ పారిశ్రామిక పటంలో కీలక కేంద్రంగా ఎదిగి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో మరింత ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
పెమ్మసాని స్పీచ్ కి దద్దరిల్లిన సభ సీఎం చంద్రబాబు ఫిదా | Asianet News Telugu
Recommended image2
Now Playing
CM Chandrababu Speech: హీరో మోటార్స్ విస్తరణ సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Now Playing
బొజ్జల సుధీర్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Bojjala Sudheer Reddy Powerful Speech | Asianet Telugu
Related Stories
Recommended image1
Railway: ఎంత వేగంగా వెళ్లినా రైలు పట్టాలపై ఎందుకు జారిపోదు.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.?
Recommended image2
Lock: ఈ తాళానికి తాళం చెవి ఉండ‌దు.. ఫింగ‌ర్ ప్రింట్‌తో ఓపెన్ అయ్యే స్మార్ట్ లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved