- Home
- Andhra Pradesh
- Andhra Pradesh లో మరో ప్రఖ్యాత సంస్థ.. 8000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమైన ప్రభుత్వం
Andhra Pradesh లో మరో ప్రఖ్యాత సంస్థ.. 8000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమైన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో ఏరోస్పేస్ పార్క్ స్థాపన చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ అన్నారు. దీని కోసం సుమారు 8 వేల ఎరాల భూమిని కేటాయించనున్నట్లు మంత్రి చెప్పారు.
- FB
- TW
- Linkdin
Follow Us

ఏరోస్పేస్ పార్క్
బెంగళూరుకు సమీపంలో ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఆలోచనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. దేవనహళ్లి ప్రాంతంలో రైతుల భూములు తీసుకోవాలన్న ప్రణాళికపై రైతులు 1,100 రోజులకు పైగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. భూములు సేకరించవద్దని, భూసేకరణకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం
రైతుల ఆందోళనను విరమింపజేసిన ప్రకటన తర్వాత మరో రాష్ట్రం మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు దూసుకు వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ స్పందిస్తూ, కర్ణాటక వదులుకున్న ఏరోస్పేస్ పార్క్ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం పలికింది. లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, కర్ణాటక నిర్ణయం వినడం బాధగా ఉందన్నా, తమ వద్ద మంచి ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.
ఏరోస్పేస్ పాలసీ
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీని అమలు చేస్తోందనీ, పెట్టుబడిదారులకు లభించే మద్దతు, ప్రోత్సాహకాలు దేశంలోనే ఉత్తమమైనవని మంత్రి వివరించారు. బెంగళూరుకు సమీపంలోనే వందలాది ఎకరాల భూమి వినియోగానికి సిద్ధంగా ఉందని, త్వరలో ఏరోస్పేస్ రంగంలోని ప్రముఖుల్ని కలుస్తానని కూడా లోకేశ్ తెలిపారు.
స్వచ్ఛందంగా భూములను
చెన్నరాయపట్టణం, దేవనహళ్లి తాలూకాల్లోని భూములను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు గత మూడున్నరేళ్లుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. చివరకు ప్రభుత్వం పర్యవేక్షణలో రైతు సంఘాల నేతలతో సమావేశమైన అనంతరం సీఎం సిద్ధరామయ్య తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, వారినుంచే భూములు తీసుకుంటామని, వారికి తగిన నష్టపరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఏరోస్పేస్ పార్క్ స్థాపన
భూములను ఇవ్వదలచుకోని రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిశ్రమల అభివృద్ధి అవసరమే అయినా, రైతుల హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం పేర్కొన్నారు.ఇక ఈ అంశంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. సిద్దరామయ్య రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. సామాజిక న్యాయం మాటల్లో కాదు, పనుల్లో చూపారని అభిప్రాయపడ్డారు.
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఏరోస్పేస్ పార్క్ స్థాపనకు కొత్త అవకాశాలు తలుపుతట్టాయి. ఈ అవకాశాన్ని పట్టాలెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొస్తూ, పెట్టుబడిదారులకు దోహదం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పునర్‌ప్రారంభానికి అనుగుణంగా రాష్ట్రం లోకేష్ నేతృత్వంలోని ఐటీ విభాగం ద్వారా పరిశ్రమలకు కొత్త ఊపునిచ్చే ప్రయత్నాల్లో ఉంది.