- Home
- Andhra Pradesh
- New Traffic Rules in AP : ఇకపై వెహికిల్ నడిపేవారికే కాదు... వెంటున్నవారికీ ట్రాఫిక్ ఫైన్స్
New Traffic Rules in AP : ఇకపై వెహికిల్ నడిపేవారికే కాదు... వెంటున్నవారికీ ట్రాఫిక్ ఫైన్స్
ఇకపై కేవలం వాహనం నడిపేవారే కాదు వారి వెంటున్నవారు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. లేదంటే భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. శనివారం నుండి కొత్త వాహనచట్టం ప్రకారం ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారు... ఆ ఫైన్స్ ఎలా ఉన్నాయో చూడండి.

New Motor Vehicle Act in Andhra Pradesh
New Motor Vehicle Act in Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 1 అంటే ఇవాళ్టినుండి నూతన మోటార్ వాహన చట్టం అమలులోకి వస్తోంది. దీంతో ట్రాఫిక్ రైల్స్ పాటించకుండా పట్టుబడితే విధించే ఫైన్ భారీగా పెరిగాయి. కాబట్టి ఇకపై వాహనాలు తీసుకుని రోడ్డుపైకి వచ్చేవాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే... లేదంటే ట్రాఫిక్ పోలీసులు వేసి ఫైన్స్ కు జేబుకు చిల్లుపడటం ఖాయం.
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూల్స్ పెట్టినా, ఎంత కఠినంగా వ్యవహరించినా వాహనదారులు మారడంలేదు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు... డ్రంక్ ఆండ్ డ్రైవ్ వంటి కేసుల్లో వాహనాలను స్వాధీనం చేసుకుని జైలుకు పంపుతున్నా మార్పు రావడంలేదు. అందువల్లే భారీ జరిమానాలతో వారిని దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ద్విచక్ర వాహనంపై ప్రయాణంలో హెల్మెట్ ఎంతో రక్షణ ఇస్తుంది. పొరపాటున ఏదయినా ప్రమాదం జరిగితే తలకు గాయం కాకుండా హెల్మెట్ కాపాడుతుంది. కానీ చాలామంది హెయిర్ స్ట్రైల్ చెదిరిపోతుందని, హెయిర్ ఫాల్ అవుతుందని ఏవేవో కారణాలు చెప్పి హెల్మెట్ ధరించకుండానే డ్రైవింగ్ చేస్తుంటారు. అలాంటివారికి ఈ మోటార్ వాహన చట్టం భారీ షాక్ ఇచ్చింది... కేవలం డ్రైవర్ మాత్రమే కాదు వెనకాల కూర్చున్నవారికి హెల్మెట్ లేకున్నా భారీ జరిమానా విధించనున్నారు.
Traffic Challans
ఏపీలో ట్రాఫిక్ చలాన్లు ఏ స్థాయిలో పెరిగాయంటే...
కొత్త వాహన చట్టం ప్రకారం శనివారం నుండి ట్రాఫిక్ చలాన్లు పడతాయి. అంటే వాహనంపై రోడ్డుపైకి వెళ్లినపుడు ఏ తప్పు చేసినా భారీగా చలాన్లు పడతాయి. ఏమాత్రం భయం లేకుండా రెగ్యులర్ ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడేవారికి తాజాగా పెంచిన ఫైన్స్ కంట్రోల్ లో పెట్టనున్నాయి.
కొత్త మోటర్ యాక్ట్ ప్రకారం టూవీలర్ నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి... లేకుండా బైక్ నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డా, వారి కెమెరాకు చిక్కినా ఏకంగా రూ.1000 జరిమానా విధిస్తారు. ఆసక్తికర విషయం ఏంటంటూ డ్రైవర్ మాత్రమే కాదు వెనకాల ఎవరైనా ఉంటే వాళ్ళుకూడా హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి చేసారు. వెనకాల కూర్చున్నవారు హెల్మెట్ పెట్టుకోకున్నా సేమ్ రూ.1000 జరిమానా విధిస్తారు.
వాహనానికి ఇన్సూరెన్స్ లేకుంటే రూ.2000 జరిమానా విధిస్తారు. మొదటిసారి అయితే ఇంతటితో వదిలేస్తారు... అలాకాకుండా ఏ రెండోసారో మూడోసారో ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే రూ.4000 ఫైన్ వేస్తారు. కాబట్టి ఇలా భారీ ఫైన్ కట్టేకంటే ఇన్సూరెన్స్ ఏ రూ.2 వేలో రూ.3 వేలో ఉంటుంది... ఈ మొత్తం చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నివిధాలా మంచింది.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం ఎక్కారో అంతే సంగతి... ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఏకంగా రూ.5000 ఫైన్ వేస్తారు. కాబట్టి డ్రైవింగ్ లేకుండా వాహనం నడపకండి...అలాగే లైసెన్స్ లేనివారికి మీ వాహనం ఇవ్వకండి.
Andhra Pradesh New Motor Vehicle Act
అత్యధికంగా రూ.10 వేల ట్రాఫిక్ ఫైన్... ఏ తప్పు చేస్తే వేస్తారో తెలుసా?
మిగతా ఫైన్స్ విషయానికి వస్తే... పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.1500, సెల్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు చేతిలో పట్టుకుని, ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.1500 జరిమానా విధిస్తారు. అయినా కూడా మారకుండా రెండోసారి కూడా ఇలాగే డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.10,000 జరిమానా కట్టాల్సి వస్తుంది.
ఇక కార్లు, ఆటోలు నడిపే సమయంలో కూడా అజాగ్రత్తగా వ్యవహరించిన ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు కట్టాల్సి వస్తుంది.యూనిఫాం లేకుండా ఆటో నడిపితే రూ.150 ఫైన్ వేస్తారు. రెండోసారి కూడా అలాగే యూనిఫాం లేకుండా పట్టుబడితే ఈసారి రూ.300 జరిమానా విధిస్తారు.
కార్లలో అయితే సీటు బెల్టు ధరించడం తప్పనిసరి. ఒకవేళ సీటుబెల్టు లేకుండా నడుపుతూ పట్టుబడితే రూ.1000 జరిమానా విధిస్తారు. పక్కసీటులోని వారు సీటు బెల్టు పెట్టుకోకున్నా రూ.1000 ఫైన్ కట్టాల్సింది. అంటే కారులోని అందరూ సీటు బెల్టు పెట్టుకోవాల్సిందే అన్నమాట.
వాహనాలను రిజిస్ట్రేషన్ కాకుండానే రోడ్లపైకి తెచ్చినా, ఫిట్ నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2000, ఆ తర్వాత కూడా ఇలాగే చేస్తే రూ.5000 జరిమానా విధిస్తున్నారు.
పరిమితికి మించి వేగంగా నడిపితే రూ.1000, పరిమితికి మించి ఎక్కువమంది ప్రయాణిస్తే రూ.1000 విధిస్తారు. ఇక రేసింగ్ లో పాల్గొని మొదటిసారి పట్టుబడితే రూ.5000, తర్వాత కూడా మళ్లీ ఇలాగే పట్టుబడితే రూ.10000 జరిమానా విధిస్తారు.
డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిబంధనలను మరింత కఠినం చేసారు. ఇకపై మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.10000 జరిమానా విధించడమే కాకుండా ఎక్కువసార్లు పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్ కు రూ.1000 జరిమానా విధిస్తారు. శబ్దం, పొగ కాలుష్యానికి కారణమైతే 2 వేల నుంచి 4 వేల రూపాయలు జరిమానా విధిస్తారు