MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఇంత పిరికిపందవు, చేతకానివాడివి అనుకోలేదు..: జగన్ కు షర్మిల చాలా గట్టిగా ఇచ్చిపడేసింది...

ఇంత పిరికిపందవు, చేతకానివాడివి అనుకోలేదు..: జగన్ కు షర్మిల చాలా గట్టిగా ఇచ్చిపడేసింది...

సొంత సోదరుడి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని షర్మిల టార్గెట్ చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయి రాజకీయంగా దెబ్బతిన్న ఆయనను మరింత దెబ్బతీసే ప్రయత్నాల్లో వున్నారు. ఇందుకోసం టార్గెట్ జగన్ అమలుచేస్తున్నారు... 

2 Min read
Arun Kumar P
Published : Jul 29 2024, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
YS Jagan vs YS Sharmila

YS Jagan vs YS Sharmila

YS Jagan vs YS Sharmila : ఆంధ్ర ప్రదేశ్ లో అధికార టిడిపి కూటమి,  ప్రతిపక్ష వైసిపి నాయకుల కంటే అన్నాచెల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్యే రాజకీయ వైరం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యా విబేధాలున్న విషయం అందరికీ తెలిసిందే... ఇదికాస్త రాజకీయ విబేధాల దారితీసాయి. సొంత అన్నకు వ్యతిరేకంగా వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు జగన్ ఓటమికి షర్మిల కూడా ఓ కారణమే. అధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, లోపాయికారిగా చంద్రబాబు నాయుడు కోసం ఆమె పనిచేసారన్నది ప్రచారం. ఎలాగైతేనేం వైఎస్ జగన్ ఓడిపోయారు కాబట్టి షర్మిల ఇక ఆయనను వదిలిపెడతారని అందరూ భావించారు. కానీ షర్మిల మాత్రం అన్నను విడిచిపెట్టడంలేదు. 
 

27
YS Jagan vs YS Sharmila

YS Jagan vs YS Sharmila

అధికారం కోలపోయినా వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూనే వున్నారు షర్మిల. ముఖ్యమంత్రి ఎలాగే విఫలమయ్యారు... ప్రతిపక్ష నాయకుడిగా అయినా ప్రజలు మెచ్చేలా నడుచుకొండి అంటూ తాజాగా అన్నకు చురకలు అంటించారు షర్మిల. ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే అసెంబ్లీకి వెళతారా..? లేదంటే వెళ్లరా..? ఇదేం పద్దతి అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి... ఇదీ మీ బాధ్యత... అలాకాదని అసెంబ్లీ వెళ్లనంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేయండి.. అప్పుడు మిమ్మల్సి అసెంబ్లీకి వెళ్లమని ఎవరూ అడగరు... అంటూ షర్మిల సీరియస్ కామెంట్స్ చేసారు.  
 

37
YS Jagan vs YS Sharmila

YS Jagan vs YS Sharmila

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం మరోటి వుండదని... ఆయనకున్న అహకారం, అజ్ఞానం ఎక్కడా కనబడవు, వినబడవని అన్నారు. బాధ్యతాయుతమైన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వుండి అసెంబ్లీ వెళ్లననడం సిగ్గుచేటు... మిగతా ఎమ్మెల్యేలకు ఇదేనా మీరిచ్చే సందేశం అంటూ షర్మిల మండిపడ్డారు. 

47
YS Jagan vs YS Sharmila

YS Jagan vs YS Sharmila

అయితే మోసం చేయడం వైఎస్ జగన్ కు కొత్తేమీకాదు... కానీ ఇలాంటి మోసం ఎప్పుడూ చూడలేదన్నారు. ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేస్తున్నారని అన్నారు. ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం ఆయనకే చెల్లిందన్నారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం అంటూ ఘాటుగా విమర్శించారు. 

57
YS Jagan vs YS Sharmila

YS Jagan vs YS Sharmila

ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లిజిస్లేటివ్ అసెంబ్లీ... మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని షర్మిల అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల తరపున గొంతుక వినిపించడానికి... అంతేగాని మీ పదవుల కోసం కాదన్నారు. మీడియా ముందు సొంతడబ్బా కొట్టుకోవడానికి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఏముంది...  ఖాళీగా వుండికూడా ఆ పని చేయవచ్చంటూ జగన్ ను ఎద్దేవా చేసారు షర్మిల. 

67
YS Jagan vs YS Sharmila

YS Jagan vs YS Sharmila

గత ఐదేళ్ల జగన్ అవినీతి, దోపిడీమయం... రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చారని షర్మిల ఆరోపించారు. మీ పాలనా వైఫల్యాలను ప్రస్తుత ప్రభుత్వం నిండు సభలో బైటపెడుతోంది... వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తుందని అన్నారు. కానీ మీరేమో అసెంబ్లీకి పోకుండా తాపీగా ప్యాలస్ లో మీడియా సమావేశాలు పెట్టుకవడం ఏమిటని ప్రశ్నించారు. మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రభుత్వం బయటపెడుతుంటే అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? అంటూ జగన్ ను నిలదీసారు షర్మిల. 

77
YS Jagan vs YS Sharmila

YS Jagan vs YS Sharmila

అసెంబ్లీకి వెళ్లనని చెప్పే జగన్ ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారన్నారు షర్మిల. బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు... ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు... ఇలాగే ప్రజాతీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో... అంటార్కిటికా మంచులోకే పోతారో ఎవడికి కావాలంటూ ఎద్దేవా చేసారు. అసెంబ్లీకి వెళ్లకుంటే జగన్ అండ్ కో తక్షణమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని షర్మిల డిమాండ్ చేసారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వై. ఎస్. షర్మిల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved