MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • నారావారి వారసుడంటే ఆమాత్రం వుంటుంది... దేవాన్ష్ లుక్ అదిరిపోయిందిగా...

నారావారి వారసుడంటే ఆమాత్రం వుంటుంది... దేవాన్ష్ లుక్ అదిరిపోయిందిగా...

నారావారి వారసుడు దేవాన్ష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. తాత, తండ్రి ప్రమాణస్వీకార సమయంలో... నారావారి కుటుంబ తిరుమల పర్యటన సమయంలో దేవాన్ష్ లుక్ చూసి చాలామంది ఫిదా అయ్యారు.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 14 2024, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Nara Devansh

Nara Devansh

తిరుమల : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. గత ఐదేళ్ళు దేవాన్ష్ అస్సలు బయట కనిపించలేదు... తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం తర్వాత దేవాన్ష్ సందడి మళ్లీ మొదలైంది. తాత చంద్రబాబు, నాన్నమ్మ భువనేశ్వరితో తల్లిదండ్రులు నారా లోకేష్, బ్రాహ్మణిలతో కలిసి దేవాన్ష్ తరచూ కనిపిస్తున్నారు. ఎప్పుడో చిన్న పిల్లాడిగా అతడిని చూసినవారు ఇప్పుడు చూసి ఇంత పెద్దవాడయ్యాడా అంటూ ఆశ్యర్యపోతున్నారు. ఇక తెలుగు తమ్ముళ్లు నారావారి వారసుడి నయా లుక్ కు ఫిదా అవుతున్నారు. 
 

27
Nara Devansh

Nara Devansh

 ఇటీవల తాత చంద్రబాబు నాయుడు, తండ్రి లోకేష్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో దేవాన్స్ సరికొత్తగా కనిపించారు. సేమ్ టు సేమ్ తండ్రిలాగే వైట్ షర్ట్ లో అతడు చాలా హుందాగా కనిపించాడు. ఈ లుక్ సంగతి అటుంచింతే అతడి షర్ట్ పై సైకిల్ గుర్తును చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తాత, తండ్రి మాదిరిగానే దేవాన్ష్ కూడా సైకిల్ గుర్తును గుండెలపై పెట్టుకున్నాడని... నారావారి వారసుడంటే ఆ మాత్రం వుంటుంది అంటూ కొనియాడుతున్నారు.  
 

37
Nara Devansh

Nara Devansh

ఇక ప్రమాణస్వీకారం తర్వాత నారావారి కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లింది. ఇక్కడ దేవాన్ష్ పూర్తిగా ఆద్యాత్మిక వేషధారణలో కనిపించారు.  ఆ వైకుంఠవాసుడి చిత్రంతో కూడిన కాషాయ వస్త్రాలు ధరించి, మెడలోనూ శ్రీవారి లాకెట్ ధరించి దేవాన్ష్ కనిపించాడు. అతడి వేషధారణకు కేవలం టిడిపి శ్రేణులే కాదు స్వామివారు భక్తులు కూడా ఫిదా అయ్యారు. 

47
Nara Devansh

Nara Devansh

కేవలం దేవాన్ష్ మాత్రమే కాదు చంద్రబాబు, భువనేశ్వరి... లోకేష్, బ్రాహ్మణి దంపతులు కూడా సాంప్రదాయ వేషధారణలో కనిపించారు. ఇలా నారావారి కుటుంబం ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీవారిని దర్శించుకున్నారు. చాలాకాలం తర్వాత తిరుమలకు పూర్వవైభవం వచ్చిందని... స్వామివారిని పూజించే తీరు ఇలాగే కదా అంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై టిడిపి శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. 
 
 

57
Nara Devansh

Nara Devansh

ఇక టిడిపి కూటమి ఘన విజయం తర్వాత నారా, నందమూరి కుటుంబం జరుపుకున్న సంబరాల్లో నారా దేవాన్ష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అతడిచేతే కుటుంబసభ్యులు కేక్ కట్ చేయించారు. తాత, నాన్నమ్మ చంద్రబాబు, భువనేశ్వరితో పాటు తల్లిదండ్రులు లోకేష్, బ్రాహ్మణి కూడా దేవాన్ష్ ను ఆనందంతో ముద్దాడారు. ఇక మిగతా కుటుంబసభ్యులు కూడా దేవాన్ష్ కు కేక్ తినిపించారు. ఇలా నారా నందమూరి కుటంబ ఆత్మీయ అనుబంధాలను దేవాన్ష్ వారధిగా మారాడని ఈ సంబరాలను బట్టి అర్థమవుతుంది. 

67
Nara Devansh

Nara Devansh

నారా దేవాన్ష్ ను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఎంతలా ఇష్టపడతారో తెలియజేసే వీడియోలు, ఫోటోలు అనేకం బయటకు వచ్చాయి. ముఖ్యంగా మనవడితో చంద్రబాబు సరదాగా ఆడుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది... ఇది టిడిపి శ్రేణులు, నారావారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సుదీర్ఘకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి... ఎప్పుడూ గంభీరంగా కనిపించే వ్యక్తి ఈయనేనా..? అనే అనుమానం చంద్రబాబు, దేవాన్ష్ వీడియోను చూసినప్పుడు కలగక మానదు. 

77
Devansh

Devansh

ఇదలావుంటే తాజా ఎన్నికల్లో టిడిపి విజయం... నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, లోకేష్ మంత్రిగా మారినతర్వాత ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నారావారి కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో భారీగా షేర్స్ వన్నాయి... వీటి ధర అమాంతం పెరిగిపోవడంతో వాళ్లకు వందలకోట్ల ఆదాయం సమకూరింది. దీంతో తొమ్మిదేళ్ల చంద్రబాబు మనవడు దేవాన్ష్ నాయుడు కూడా కోటీశ్వరుడయ్యాడు. దేవాన్ష్‌కు హెరిటేజ్ ఫుడ్స్ లో 0.06 శాతం వాటా ఉంది... అంటే  56,075 షేర్లు అతడి పేరిట వున్నాయన్నమాట. వీటి ధర పెరగడంతో రూ.2.4 కోట్ల విలువున్న షేర్లు కాస్త రూ.4.1 కోట్లు అయ్యారు.   

 

 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Kondapalli Srinivas: చెప్పిన టైం కంటే ముందే పూర్తి చేశాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్| Asianet Telugu
Recommended image2
Now Playing
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ లో రామ్మోహన్ నాయుడు స్పీచ్| Asianet Telugu
Recommended image3
Now Playing
Bhumana Karunakar Reddy Comments: తిరుమలలో మద్యం సీసాల అంశంపై భూమన ఫైర్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved