- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ.. అసలు విషయం తెలిసిన పోలీసులకు షాక్
Andhra Pradesh: హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ.. అసలు విషయం తెలిసిన పోలీసులకు షాక్
వ్యక్తిని కత్తితో బెదిరించి హత్యాయత్నం చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టునే బురిడి కొట్టించాడు. తల్లికి అనారోగ్యం అంటూ అనిల్ సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ వెనకాల ఉన్న అసలు విషయం తెలిసి అధికారులు కంగుతున్నారు. ఇంతకీ బోరుగడ్డ హైకోర్టును ఎలా బురిడి కొట్టించారో తెలిసే షాక్ అవ్వాల్సిందే..

వైసీపీ హయాంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులపై ఓ రేంజ్‌లో చెలరేగిపోయాడు బోరుగడ్డ అనిల్. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డపై రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 14 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హత్యాయత్నం కేసులో భాగంగా అరండల్ పేట పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కొన్ని కేసుల్లో మధ్యంతర బెయిల్ వచ్చినా.. తర్వాత అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ మంజూరు కాలేదు.
తల్లికి అనారోగ్యం అంటూ బెయిల్ పిటిషన్.
ఈ క్రమంలోనే తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతోందని చికిత్స చేయించేందుకు బెయిల్ మంజూరు చేయాలని ఫిబ్రవరి 14వ తేదీన హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సమయంలో తల్లి అనారోగ్యానికి సంబంధించి సర్టిఫికెట్ సైతం కోర్టులో సబ్‌మిట్ చేశాడు. దీంతో పిటిషను స్వీకరించిన హైకోర్టు అనిల్‌కు ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం 28వ తేదీ సాయంత్రం అనిల్ రాజమండ్రి జైలు సూపరిండెంట్ వద్ద లొంగిపోయాడు.
మరోసారి బెయిల్ పిటిషన్.
ఇదిలా ఉంటే తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నైలోని ఓ ఆసుపత్రిలో వైద్యం అందించాలని మరోసారి మార్చి 1వ తేదీన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ఇందుకు సంబంధించి గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీకి చెందిన డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు కోర్టుకు సమర్పించారు. తల్లికి అనిల్ ఒక్కడే సంతానమని మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరడంతో మార్చి 11వ తేదీ వరకు మద్యంతర బెయిల్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది.
వెలుగులోకి అసలు విషయం.
మార్చి 11వ తేదీ వరకు మద్యంతర బెయిల్ పొడగించిన తర్వాత గుంటూరు పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. గుంటూరులో మంచి నిపుణులైన డాక్టర్లు ఉండగా అసలు చెన్నై వెళ్లాల్సిన అవసరం ఏముంది అని ఆరా తీయడం మొదలు పెట్టారు. దీంతో అసలు విషయలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరులో సర్టిఫికెట్ ఇచ్చిన లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి పోలీసులు ఆరా తీయగా.. అదంతా కట్టు కథేనని అసలు తాము ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పడంలో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇంతకీ అనిల్ ఎక్కడనున్నారు.?
హాస్పిటల్ సర్టిఫికేట్ ఫేక్ అని తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంతకీ అనిల్ ఎక్కడనున్నాడన్న విషయాన్ని తెలుసుకునేందుకు అతనికి కాల్ చేశారు. అయితే అనిల్ ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిల్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే అనిల్‌ను ఎందుకు విడుదల చేశారని విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అనిల్ ఎక్కడున్నాడు.? ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మరి తప్పుడు డాక్యుమెంట్స్‌తో బెయిల్ పొందిన అనిల్‌పై ఇంకెన్ని కేసులు నమోదవుతాయో చూడాలి.