MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Amaravati: రూ. 2500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. 2 టవర్లు, 1800 కార్ల పార్కింగ్ సౌకర్యం..

Amaravati: రూ. 2500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. 2 టవర్లు, 1800 కార్ల పార్కింగ్ సౌకర్యం..

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర ప్రభుత్వం అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఆమోదం తెలపడంతో రాజధాని నిర్మాణానికి మరింత వేగం చేకూరనుంది. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jun 10 2026, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేంద్ర కేబినెట్ నుంచి కీలక ఆమోదం
Image Credit : Gemini AI

కేంద్ర కేబినెట్ నుంచి కీలక ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతికి సంబంధించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించింది. సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (CGGPOA) పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్యాలయ మౌలిక వసతులను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.2,534 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాలు ఒకే ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయి. దీంతో అమరావతి పరిపాలనా కేంద్రంగా మరింత బలోపేతం కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కార్యాలయ సముదాయం ఎలా ఉండబోతోంది?
Image Credit : Gemini AI

కార్యాలయ సముదాయం ఎలా ఉండబోతోంది?

ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక కార్యాలయ సముదాయం నిర్మించనున్నారు. రెండు భారీ టవర్లలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఒకే ప్రాంగణంలో పలు శాఖలు పనిచేయడం వల్ల పరిపాలనా సమన్వయం మెరుగుపడటంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఉంది. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించే ఈ కార్యాలయ సముదాయంలో దాదాపు 1,800 కార్ల పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ రూపకల్పన చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Related Articles

Related image1
మ‌రో సెన్సేష‌న్ సాంగ్ లోడింగ్‌.. ఇక‌పై ప్ర‌తీ పెళ్లి బ‌రాత్‌లో ఈ పాట ఉండాల్సిందే, సౌండ్ ల‌గారే అనాల్సిందే
Related image2
హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
35
కేంద్ర ఉద్యోగుల కోసం ప్రత్యేక నివాస సముదాయం
Image Credit : twitter

కేంద్ర ఉద్యోగుల కోసం ప్రత్యేక నివాస సముదాయం

కార్యాలయాల నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,234 కోట్ల వ్యయంతో ఈ నివాస ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 11 టవర్లలో 1,568 నివాస యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం, కమ్యూనిటీ హాల్స్, వినోద సదుపాయాలు, భద్రతా వ్యవస్థలతో కూడిన ఆధునిక గేటెడ్ కమ్యూనిటీగా దీనిని అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అమరావతిలో విధులు నిర్వహించే కేంద్ర ఉద్యోగులకు ఇది పెద్ద సౌకర్యంగా మారనుంది.

45
సీఆర్‌డీఏ భూముల కేటాయింపు.. నిర్మాణానికి సిద్ధమైన ప్రణాళిక
Image Credit : our own

సీఆర్‌డీఏ భూముల కేటాయింపు.. నిర్మాణానికి సిద్ధమైన ప్రణాళిక

ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే సీఆర్‌డీఏ 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలు నిర్మించనుండగా, మిగిలిన 17 ఎకరాల్లో నివాస సముదాయాన్ని అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖల సహకారంతో ప్రతిపాదనలు తుది ఆమోదం పొందాయి.

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గతంలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కార్యరూపం దాల్చడం సంతోషకరం అని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు.

55
అమరావతి అభివృద్ధికి కొత్త ఊపు
Image Credit : our own

అమరావతి అభివృద్ధికి కొత్త ఊపు

ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉనికిని మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పలు శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల పరిపాలనా సామర్థ్యం పెరుగుతుందని, ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుతాయని అభిప్రాయపడ్డారు. అమరావతిని ప్రపంచ స్థాయి పరిపాలనా నగరంగా తీర్చిదిద్దే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మద్ధతుతో రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగం పుంజుకుంటుందని, దీర్ఘకాలికంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
స్థిరాస్తి
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
AP & TElangana Rain Alert! వాతావరణశాఖా హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు |
Recommended image2
Now Playing
YS Jagan Pressmeet: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
Recommended image3
Now Playing
YS Jagan Meets Vizag Steel Plant Tragedy Victims: స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా.. వైఎస్ జగన్
Related Stories
Recommended image1
మ‌రో సెన్సేష‌న్ సాంగ్ లోడింగ్‌.. ఇక‌పై ప్ర‌తీ పెళ్లి బ‌రాత్‌లో ఈ పాట ఉండాల్సిందే, సౌండ్ ల‌గారే అనాల్సిందే
Recommended image2
హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved