మూడు రాజధానులు: జగన్ చేసింది అదే, చంద్రబాబు టార్గెట్ బిజెపి

First Published 7, Aug 2020, 9:15 AM

రాజధాని నిర్ణయంలో తమ పాత్ర ఉండదని, అది రాష్ట్ర పరిధిలోది అని కేంద్రం కోర్టులో అఫిడివిట్ దాఖలు చేసిన నేపథ్యంలో టీడీపీ బిజెపిని లక్ష్యంగా ఎంచుకుంది.

మూడు రాజధానుల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజెపిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెసును లక్ష్యం చేసుకుని 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు కేంద్రానికి లేఖ సమర్పించి కూడా విభజనకు కాంగ్రెసు కారణమంటూ దూషిస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు బిజెపిని లక్ష్యం చేసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాజధాని నిర్ణయంలో తమ పాత్ర ఉండదని, అది రాష్ట్ర పరిధిలోది అని కేంద్రం కోర్టులో అఫిడివిట్ దాఖలు చేసిన నేపథ్యంలో టీడీపీ బిజెపిని లక్ష్యంగా ఎంచుకుంది.

ఇలాంటి సంక్షోభం తలెత్తినప్పుడు జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి స్పష్టమైన అధికారాలున్నాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో కూడా చెప్పారు. బయటి నుంచి దురాక్రమణ, అంతర్గత సంఘర్షణలు, రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా పాలన సాగనప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవచ్చునని రాజ్యాంగంలో ఉందని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ఆ మార్గదర్శకాలను నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. కేంద్రం ఏ విధంగా జోక్యం చేసుకోవచ్చునో కూడా ఆయన వివరించారు.

రాష్ట్రానికి చెందిన అంశాల్లో తమ ఉండదని కేంద్రం అనడంపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు కూడా స్పందించారు. విభజన చట్టాన్ని కేంద్రం ఓసారి గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. విభజన చట్టం ప్రకారం శివరామకృష్ణన్ కమిటీ అమరావతిని రాజధానిగా చేయడానికి ఆమోదం తెలిపిదంని, కమిటీ సూచనల మేరకే 5 కోట్ల మందికి అనుకూలంగా ఉండే పద్ధతిలో విజయవాజ ప్రాంతంలో రాజధానిని నిర్మించామని ఆయన చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ వేసిన కేంద్రమే ఇప్పుడు రాజధాని అంశం తమ పరిధిలో లేదని చెప్పడం సరికాదని ఆయన అన్నారు.

తూళ్లూరు, మందడం, వెలగపూడి వంటి 29 గ్రామాల్లో విస్తరించిన ప్రాంతాన్ని అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు 2015లో ప్రకటించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో చంద్రబాబు కేంద్రం అనుమతి ఏమీ తీసుకోలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని రాజధాని విషయంలో సంప్రదించలేదు. తాము అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించినట్లు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది.

ఆ సమయంలో చంద్రబాబు రాజధాని విషయంలో తీసుకున్నది రాజకీయ నిర్ణయమే. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నది కూడా రాజకీయ నిర్ణయమే. అమరాతి భూముల విషయంలో టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని జగన్ ఆరోపిస్తున్నారు. పైగా, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం కోసమే మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చంద్రబాబు అప్పట్లో ప్రయత్నించారనేది స్పష్టం. ఇప్పుడు టీడీపీని దెబ్బ కొట్టి, తన ప్రాబల్యం పెంచుకోవడానికి జగన్ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారనేది కూడా అంతే స్పష్టం. అయితే, కేంద్ర ప్రభుత్వం తనకు సహకరించడానికి ముందుకు రాకపోవడమే చంద్రబాబుకు బిజెపిని లక్ష్యం చేసుకోవడానికి కారణంగా చెప్పవచ్చు.

loader