త్వరలో 5జి‌ సపోర్ట్ తో లాంచ్ కానున్న రియల్‌మీ ఎక్స్ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

రియల్‌మీ కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ సోషల్‌మీడియాలో సూచించిన విధంగా రియల్‌మీ ఎక్స్‌ 7, రియల్‌మీ ఎక్స్‌ 7ప్రో రెండు కొత్త మోడళ్లను త్వరలో భారత్‌లో ఆవిష్కరించనుంది.    
 

soon Realme X7, Realme X7 Pro smartphones with 5g support  launch in India officially teased

స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ 5జి సపోర్ట్ తో రియల్‌మీ ఎక్స్ 7 సిరీస్‌ను సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ చేసింది. అయితే రియల్‌మీ కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ సోషల్‌మీడియాలో సూచించిన విధంగా రియల్‌మీ ఎక్స్‌ 7, రియల్‌మీ ఎక్స్‌ 7ప్రో రెండు కొత్త మోడళ్లను త్వరలో భారత్‌లో ఆవిష్కరించనుంది.    

రియల్‌మీ ఎక్స్7, ఎక్స్7ప్రో లాంచ్ ఇండియాలో
రియల్‌మీ సంస్థ త్వరలో రియల్‌మే ఎక్స్‌ 7 సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. సోషల్ మీడియాలో మాధవ్ షెత్ ఒక దీపావళి లేఖను షేర్ చేస్తూ 'ఈ 5జి రియల్‌మీ ఎక్స్7 సిరీస్ భారతదేశంలో రియల్‌మీ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న ఏ‌ఐ‌ఓ‌టి ఉత్పత్తులతో ఒకటి' అంటూ ట్వీట్ చేశారు.

గతంలో కూడా ముకుల్ శర్మ రియల్‌మీ ఎక్స్‌ 7, రియల్‌మీ ఎక్స్‌7ప్రో డిసెంబర్‌లో ఇండియాలో లాంచ్ అవుతుందని సూచించారు.  

  రియల్‌మీ ఎక్స్ 7 స్మార్ట్ ఫోన్ 5జికి సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ ఎక్స్‌ 7  6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి + అమోలెడ్ పంచ్-హోల్ డిస్ ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు.

also read మహిళల ప్రేగ్నేన్సిని ట్రాక్ చేసేందుకు గార్మిన్ వెరబుల్స్ లో సరికొత్త ఫీచర్.. ...

ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరాలు 64ఎం‌పి, 8ఎం‌పి, 2ఎం‌పి, 2ఎం‌పి అలాగే ముందు కెమెరాలో 32ఎం‌పి  ఉంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రియల్‌మీ యుఐ పనిచేస్తుంది.

రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రో విషయానికొస్తే, 6.5-అంగుళాల పూర్తి హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లే పంచ్-హోల్‌తో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8జీబీ  ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది.

రియల్‌మీ ఎక్స్ 7 లాగానే వెనుక నాలుగు కెమెరాలను అందించారు. 64 ఎంపి ప్రధాన కెమెరా, 8 ఎంపి అల్ట్రా-వైడ్ లెన్స్, 2 ఎంపి మాక్రో లెన్స్, 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. ముందు వైపు 32 ఎంపి కెమెరా ఉంటుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ తో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రియల్‌మీ యుఐ పనిచేస్తుంది.

భారతదేశంలో రియల్‌మీ ఎక్స్7, ఎక్స్7ప్రో ధరల వివరాలు వెల్లడించలేదు, అయితే రియల్‌మీ ఎక్స్‌ 7 సిరీస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో రూ. 30వేల వరకు ధర ఉంటుందని అంచనా.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios