మహిళల ప్రేగ్నేన్సిని ట్రాక్ చేసేందుకు గార్మిన్ వెరబుల్స్ లో సరికొత్త ఫీచర్..
గార్మిన్ వెరబుల్ లైనప్ కోసం ప్రేగ్నేన్సీ ట్రాకింగ్ ఫీచరును తీసుకొచ్చింది, ఇది వారి గర్భధారణ సమయంలో శిశువు పెరుగుదల నమూనాలను ట్రాక్ చేయడానికి, పోషణ ఇంకా వ్యాయామంపై సమాచారం కూడా అందిస్తుంది.
అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ గార్మిన్ గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. గార్మిన్ వెరబుల్ లైనప్ కోసం ప్రేగ్నేన్సీ ట్రాకింగ్ ఫీచరును తీసుకొచ్చింది, ఇది వారి గర్భధారణ సమయంలో శిశువు పెరుగుదల నమూనాలను ట్రాక్ చేయడానికి, పోషణ ఇంకా వ్యాయామంపై సమాచారం కూడా అందిస్తుంది.
ఈ ఫీచర్స్ గార్మిన్ కనెక్ట్ ఐక్యూ యాప్ ద్వారా లభిస్తుంది. యాప్ లోని రుతు చక్రం విభాగంలో ఈ ఫీచర్ ఉంటుంది. ఒక్కసారి ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి సెటప్ చేసిన తర్వాత, వినియోగదారులు వారి వ్యాయామలపై సులభంగా ట్రాక్ చేయవచ్చు, ఇంకా హైడ్రేషన్ రిమైండర్‌లతో పాటు ఇతర రిమైండర్‌లను కూడా పొందవచ్చు.
వివోమోవ్ వెరబుల్ రేంజ్ లో గర్భధారణ ట్రాకింగ్ ఫీచర్ అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. త్వరలో ఇతర గార్మిన్ వెరబుల్ వాటికి కూడా రావచ్చు.
గార్మిన్ కనెక్ట్ యాప్ లో ఈ ఫీచర్ కోసం మొదట యూజర్ సెటింగ్స్> వుమెన్స్ హెల్త్ > సైకిల్ టైప్ > ప్రేగ్నేన్సీ ఆప్షన్ లోకి వెళ్ళడం ద్వారా గర్భధారణ ట్రాకింగ్ ప్రారంభించవచ్చు. వారి గర్భం ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి వినియోగదారులు వారి చివరి రుతు చక్రం, ఇతర సమాచారం గురించి వివరాలను అందించాల్సి ఉంటుంది.
also read హ్యాపీ దీపావళి వాట్సాప్ స్టిక్కర్లను మీ సొంతంగా క్రియేట్ చేయవచ్చు.. ఎలా అంటే ? ...
సమాచారం ఎంటర్ చేసిన తర్వాత, వినియోగదారులు వారి వెరబుల్ వాటిపై ఈ ఫీచర్ ప్రారంభించడానికి ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ కనెక్ట్ ఐక్యూ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఈ ఫీచర్ ప్రతి వారం నుండి వారానికి గర్భం ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. శిశువు కదలిక, రక్తంలో గ్లూకోజ్ లెవెల్ ట్రాక్ చేస్తుంది. కెగెల్ ప్రాక్టీస్, హైడ్రేషన్ గోల్స్ కోసం కస్టమైజ్ రిమైండర్‌లు ఉన్నాయి. ఈ కొత్త ఫీచర్ వారి బరువు పెరుగుదల గురించి కూడా నోటిఫికేషన్ అందిస్తుంది. శరీర మార్పులను నిర్ధారించడానికి నిద్ర, ‘బాడీ బ్యాటరీ’ ను ట్రాక్ చేస్తుంది.
ఈ కొత్త గార్మిన్ ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ ఫీచర్ వ్యాయామం, పోషణకు సంబంధించిన విషయాలను అందిస్తుంది. గర్భధారణ వయస్సును, పండ్లు, కూరగాయలతో పోల్చుత్తు శిశువు ఎంత పరిణామంలో ఉందో కూడా సమాచారం అందిస్తుంది.
ఈ ఫీచర్స్ అన్నీ కూడా బేబీ సెంటర్ వంటి ఇతర బేబీ ట్రాకింగ్ యాప్స్ లాగానే ఉంటాయి, కానీ మీరు గార్మిన్‌తో చేతి వాచ్ మీద లాగానే రిమైండర్‌లను పొందవచ్చు.