శాంసంగ్ సరికొత్త టీవీలు... తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్స్...
కొత్త టీవీల సేల్స్ జూన్ 19 నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శామ్‌సంగ్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఫ్రేమ్ 2020 టీవీలు ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శామ్‌సంగ్ స్టోర్ లో లభిస్తాయి.
న్యూ ఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ మంగళవారం కొత్త ఆన్‌లైన్ రేంజ్ టీవీలను, వీటిల్లో ఫ్రేమ్ 2020 ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్టు తెలిపింది. నెక్స్ట్ ఎడిషన్ 10 కొత్త స్మార్ట్ టీవీ మోడళ్లను భారతదేశంలో విడుదల చేసింది.
కొత్త టీవీల సేల్స్ జూన్ 19 నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శామ్‌సంగ్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఫ్రేమ్ 2020 టీవీలు ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శామ్‌సంగ్ స్టోర్ లో లభిస్తాయి.
అయితే కొత్త ఆన్‌లైన్ స్మార్ట్ టీవీ శ్రేణి 4కె యుహెచ్‌డి, ఎఫ్‌హెచ్‌డి, హెచ్‌డి రెడీ టివిలులను ఫ్లిప్‌కార్ట్‌లో 'గెట్ మోర్ ఫ్రమ్ టీవీ' ఇంకా 'వండర్‌టైన్మెంట్' పేరుతో అమెజాన్‌లో ప్రచారం చేస్తోంది. ఫ్రేమ్ 2020 టీవీలలో 50-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు టీవీలు ఉన్నాయి.
వీటి ధరలు 74,990, రూ .84,990, 1,39,990 రూపాయలకు లభిస్తాయి.ఫ్రేమ్ 2020 టీవీలను 10 సంవత్సరాల పాటు స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ, ప్యానెల్‌పై ఒక సంవత్సరం వారంటీతో పాటు మరొక సంవత్సరం అదనపు వారంటీ ఇస్తుంది. శామ్‌సంగ్ కొత్త శ్రేణి ఆన్‌లైన్ స్మార్ట్ టీవీలలో 4కె యుహెచ్‌డి స్మార్ట్ టివి మోడల్స్ 43 అంగుళాల టివి ధర రూ .36,990 నుండి ప్రారంభమవుతుంది.
also read గుడ్ న్యూస్: 15 రోజులకోసారి ఆఫీసుకు వస్తే చాలు..
65 అంగుళాల టివి ధర రూ .89,990 వరకు ఉండగా, ఎఫ్‌హెచ్‌డి, హెచ్‌డి రెడీ స్మార్ట్ టీవీ మోడళ్లు ధర రూ .14,490 నుంచి ప్రారంభమవుతాయి. 32 అంగుళాల మోడల్, 43 అంగుళాల మోడల్ ధర 31,990 రూపాయలు నుండి ప్రారంభమవుతుంది.
వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. ఫ్రేమ్ 2020, 10 కొత్త స్మార్ట్ టివి మోడల్స్ కూడా విస్తృత శ్రేణి ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లైన జీ5, సోని లైవ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, వూట్, వూట్ కిడ్స్, జియో సినిమా, హాట్ స్టార్ యాప్ లకు సపోర్ట్ చేస్తాయి.
శామ్‌సంగ్ కొత్త స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి 1,095 రూపాయల విలువైన ఆకర్షణీయమైన ఆఫర్లతో కంటెంట్ లభిస్తుంది. జీ5, ఎరస్ నవ్ వంటి ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల సబ్స్క్రిప్షన్ పై 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
అంతేకాకుండా, వినియోగదారులు గనా ప్లస్ వంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ లకు ఒక సంవత్సరానికి ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఫ్రేమ్ 2020ను కొనుగోలు చేసే వారికి 897 రూపాయల విలువైన శామ్‌సంగ్ ఆర్ట్ స్టోర్ కు మూడు నెలల ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు.
టీవీలు ఆటో హాట్‌స్పాట్ టెక్నాలజీ, యుఎస్‌బి 3.0, సామ్‌సంగ్ బిక్స్‌బీతో పాటు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి వాయిస్ సపోర్ట్ అసిస్టెంట్లతో వస్తాయి.