శామ్సంగ్ గెలాక్సీ ఎ30ఎస్ 128 జిబి స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో లాంచ్ చేశారు. కొత్త వేరియంట్ ప్రస్తుతం ఉన్న గెలాక్సీ ఎ30ఎస్ మోడల్‌తో పాటు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ కూడా కలిగి ఉంది. కొత్త గెలాక్సీ ఎ30ఎస్ వేరియంట్‌ను విడుదల చేయడంతో పాటు, శామ్‌సంగ్ సెప్టెంబర్‌లో విడుదల  చేసిన మోడల్ ధరను కూడా తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలోని రెడ్‌మి నోట్ 8 ప్రో, నోకియా 6.1 ప్లస్, ఒప్పో కె1లతో పోటీ పడుతుంది. దీనికి వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్ ప్లే నాచ్‌ ఉంది అలాగే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కూడా ఉంది.

also read ఇంటర్నెట్‌ నిషేధంతో రోజుకు రూ.57.5 కోట్ల నష్టం

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ30ఎస్ ధర

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎ30ఎస్ ధర కొత్తగా ప్రారంభించిన 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ.15,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్‌లలో ప్రస్తుతం అందుబాటులో లేదు కానీ కొత్త  మోడల్ ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా అందించబడుతుంది.సెప్టెంబరులో దక్షిణ కొరియా సంస్థ మొదట గెలాక్సీ ఎ30ఎస్ 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.

శామ్‌సంగ్ మొదట గెలాక్సీ ఎ30ఎస్  64 జిబి స్టోరేజ్‌ రూ. 16.999 ధర వద్ద లాంచ్ చేశారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ పై గతంలో  ధరల తగ్గింపు వచ్చింది. ఈ వారం ప్రారంభంలో దీని ధరను రూ. 14.999కు తగ్గించారు. ఈ హ్యాండ్‌సెట్ ప్రిజం క్రష్ వైలెట్, ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ A30s ఫీచర్స్
ఇందులో డ్యూయల్ సిమ్ (నానో) శామ్‌సంగ్ గెలాక్సీ ఎ30ఎస్ ఆండ్రాయిడ్ పై పని చేస్తుంది. 6.4-అంగుళాల హెచ్‌డి + (720x1560 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-వి సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 19.5: 9 రేషియో, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ కలిగి ఉంటుంది. ఫోన్‌లో ఆక్టా-కోర్ ఎక్సినోస్ 7904 SoC ఉంది, దీనితో పాటు 4GB RAM ఉంది.

also read ఇది పాపులిస్ట్ చట్టం మాత్రమే కాదు...ఫాసిస్టు చట్టం...

హ్యాండ్‌సెట్  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 25 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 1.7 లెన్స్‌తో పాటు, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం శామ్సంగ్ గెలాక్సీ ఎ30ఎస్ 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.


శామ్సంగ్ గెలాక్సీ ఏ30ఎస్ 64GB, 128GB స్టోరేజ్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఇవి రెండూ మైక్రో SD కార్డ్ (512GB వరకు) ద్వారా పెంచుకోవచ్చు. ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్ లలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరగా ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.