Asianet News TeluguAsianet News Telugu

సామ్‌సంగ్ నుండి పెరుగును తయారు చేసే ఫ్రిజ్‌... ఎలా అంటే ?

సామ్‌సంగ్ బుధవారం  కర్డ్ మాస్ట్రో  పేరిట రిఫ్రిజిరేటర్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పెరుగును తయారు చేసే ప్రాడక్ట్. సామ్‌సంగ్  సంస్థ 2020 రిఫ్రిజిరేటర్ లైనప్ అన్ని రిటైల్ షాపులో లేదా  సామ్‌సంగ్  స్టోర్లలో జనవరి నుండి లభిస్తుంది. 

samsung launches curd maestro refrigerator in india
Author
Hyderabad, First Published Jan 23, 2020, 4:45 PM IST

 ఇంట్లో పెరుగును తయారు చేయడానికి సమయం లేదా  రిఫ్రిజిరేటర్ లైనప్‌ 2020ను పరిచయం చేస్తూ సామ్‌సంగ్ బుధవారం  కర్డ్ మాస్ట్రో  పేరిట రిఫ్రిజిరేటర్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పెరుగును తయారు చేసే ప్రాడక్ట్. సామ్‌సంగ్  సంస్థ 2020 రిఫ్రిజిరేటర్ లైనప్ అన్ని రిటైల్ షాపులో లేదా  సామ్‌సంగ్  స్టోర్లలో జనవరి నుండి లభిస్తుంది.

also read ఫోటోగ్రఫి కోసం కెనాన్‌ నుండి కొత్త 5.5కె కెమెరా...ధర ఎంతంటే ?

198-లీటర్ కాపాసిటి గాల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ .17,990. కర్డ్ మాస్ట్రో మోడళ్ల ధర రూ .30,990 నుంచి రూ .45,990 మధ్య ఉంటుంది."మేము సామ్‌సంగ్  కొత్త  ఆవిష్కరణలు  ప్రజల జీవితాలలో మార్చే తెస్తుందని  నమ్ముతున్నాము. సౌలభ్యం, స్టోరేజ్ కెపాసిటీ, శక్తి సామర్థ్యం వంటివి వినియోగదారులు రిఫ్రిజిరేటర్‌ కొనే ముందు చూసే ముఖ్య లక్షణాలు.

ఇందుకోసం ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు శాంసంగ్‌  కర్డ్‌ మ్యాస్ట్రో పేరిట ప్రపంచంలోనే తొలిసారిగా పెరుగును త‌యారు చేసే నూతన రిఫ్రిజిరేటర్లను భారత్‌లో విడుదల చేసింది. "కొత్త రేంజ్ రిఫ్రిజిరేటర్లు రిఫ్రిజిరేటర్ విభాగంలో మార్కెట్ అమ్మకాలు మరింత బలోపేతం చేస్తాయని మేము నమ్ముతున్నాము" అని సామ్‌సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ అన్నారు.

samsung launches curd maestro refrigerator in india


కర్డ్ మాస్ట్రో అనేది సామ్‌సంగ్  “మేక్ ఫర్ ఇండియా” ఆవిష్కరణ. ఇది రోజు పెరుగు తయారీ వంటి సమస్యలను తిరుస్తుంది.పెరుగును చేయటం కోసం  పాలను మరిగించి చల్లార్చి వాటిలో యథావిధిగా మజ్జిగ చుక్కలను వేసి తోడు పెట్టాలి. అనంతరం ఆ పాలను ఫ్రిజ్‌లో ఉండే ప్రత్యేక బాక్స్‌లో ఉంచాలి. దీంతో 5 నుంచి 6 గంటల్లో పెరుగు తయారవుతుంది.

also read సోనీ కంపెనీ నుండి సరికొత్త వాక్‌మ్యాన్

ఎలాంటి కాలంలో అయిన ఎప్పుడైనా సరే పెరుగును అలవోకగా తయారు చేసుకోవచ్చు. అలాగే తయారైన పెరుగును ఎక్కువ సమయం పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డిఆర్ఐ) సామ్‌సంగ్ కర్డ్ మాస్ట్రోలో పెరుగు తయారీ ప్రక్రియను పరీక్షించి ధ్రువీకరణ కూడా చేసింది.

కర్డ్ మాస్ట్రో ప్రతిసారీ పెరుగును ఒకే విధంగా తయారు చేస్తుంది. కర్డ్ మాస్ట్రో రిఫ్రిజిరేటర్లు సామ్‌సంగ్  స్మార్ట్ కన్వర్టిబుల్ 5 ఇన్ 1 “ట్విన్ కూలింగ్” టెక్నాలజీతో వస్తుంది. 244-లీటర్, 265-లీటర్, 314-లీటర్, 336-లీటర్  కాపాసిటీలలో లభిస్తాయి. ఇక డైరెక్ట్‌ కూల్‌ సిరీస్‌లోనూ శాంసంగ్‌ పలు కొత్త ఫ్రిజ్‌లను లాంచ్‌ చేసింది. వీటి  ప్రారంభ ధర రూ.17,990గా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios