ఫోటోగ్రఫి కోసం కెనాన్‌ నుండి కొత్త 5.5కె కెమెరా...ధర ఎంతంటే ?

కెనాన్‌ CES 2020లో తన ప్రధాన డి‌ఎస్‌ఎల్‌ఆర్ ఈవోఎస్‌ -1డి ఎక్స్ మార్క్ 3 కెమెరాను  ఇండియాలో  విడుదల చేసింది. అన్ని దేశలలోని అన్ని ప్రధాన రిటైల్ అవుట్లెట్లలో ఫిబ్రవరి నెల నుంచి అందుబాటులో ఉంటుంది. 

Canon India launches new EOS 1DX Mark III DSLR camera

కెనాన్‌ CES 2020లో తన ప్రధాన డి‌ఎస్‌ఎల్‌ఆర్ ఈవోఎస్‌ -1డి ఎక్స్ మార్క్ 3 కెమెరాను  ఇండియాలో  విడుదల చేసింది. కెమెరా ధర కేవలం 5,75,995 రూపాయలు. ఈ విషయాన్ని కెనాన్‌ ఇండియా ఒక ప్రకటన సమయంలో ట్వీట్ చేసింది. అన్ని దేశలలోని అన్ని ప్రధాన రిటైల్ అవుట్లెట్లలో ఫిబ్రవరి నెల నుంచి అందుబాటులో ఉంటుంది. కెమెరాతో పాటు 512జి‌బి మెమరీ కార్డ్ అలాగే కార్డ్ రీడర్ అందిస్తున్నారు.

కెనాన్‌  ఈ‌ఓ‌ఎస్-1డి ఎక్స్ మార్క్ 3 ఫీచర్లు

కెనాన్‌ కెమెరాలో కొత్త  20.1-మెగాపిక్సెల్ ఫుల్-ఫ్రేమ్ సి‌ఎం‌ఓ‌ఎస్ సెన్సార్  ఇంకా కొత్త ‘హై-డిటైల్’ తక్కువ-పాస్ ఫిల్టర్‌ ఉంది.ఇందులో డిజిక్ ఎక్స్, డిజిక్ 8 ఇమేజ్ ప్రాసెసర్లను ఉన్నాయి. ఇవి ఇమేజ్ ప్రాసెసింగ్   వేగంగా చేస్తాయి.  ఈ కొత్త కాంబోలో 100-1,02,400 (50-8,19,200 కు పెంచుకోవచ్చు) ఐ‌ఎస్‌ఓ రేంజ్  ఉంది.

also read సోనీ కంపెనీ నుండి సరికొత్త వాక్‌మ్యాన్


ఆప్టికల్ వ్యూఫైండర్ ఉపయోగిస్తున్నప్పుడు, మీకు 191 ఏ‌ఎఫ్ పాయింట్స్ చూపిస్తుంది. వాటిలో 155 క్రాస్ టైప్ ఉంటాయి. లైవ్ వీక్షణలో 3,869  మాన్యువల్ సెలెక్ట్ ఏ‌ఎఫ్ పాయింట్లతో కెనాన్‌  డ్యూయల్ పిక్సెల్ సి‌ఎం‌ఓ‌ఎస్ ఏ‌ఎఫ్ సిస్టం ఉంది. ఈ‌ఓ‌ఎస్-1డి ఎక్స్ మార్క్  3  ఏ‌ఐ ‘డీప్ లెర్నింగ్’ అల్గోరిథంలను ఉపయోగించి తల, ముఖం ఇంకా ఐ ట్రాకింగ్ కూడా చేయగలదు.

Canon India launches new EOS 1DX Mark III DSLR camera

 ఆప్టికల్ వ్యూ ఫైండర్ ఉపయోగించి 16fps బ్లాస్ట్ షాట్లను కూడా షూట్ చేయవచ్చు లేదా 20fps లైవ్ వ్యూ (మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ షట్టర్) తో ఫోటోలను తీయవచ్చు. JPEG లతో సహా 1,000 ఫోటోలను స్టోర్ చేసుకోగల సామర్థ్యం కూడా ఉంది. 4 కె వీడియోను 60fps వద్ద ఓవర్‌సాంప్ చేస్తుంది.

also read గాడ్జెట్స్ ప్రేమికులకు గుడ్ న్యూస్...తక్కువ ధరకే ఐఫోన్


ఇతర ఫీచర్లలో హెచ్‌ఈ‌ఐ‌ఎఫ్ ఇమేజ్ ఫార్మాట్‌లో 10-బిట్ స్టిల్స్ సపోర్ట్  చేస్తుంది. ఇంటర్నల్ వై-ఫై, బ్లూటూత్, జి‌పి‌ఎస్, గిగాబిట్ ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి.ఈవోఎస్‌ -1డి ఎక్స్ మార్క్  3 లోని బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 2,850 ఫోటోలను తీయవచ్చు. దీని బరువు 1.4 కిలోలు ఉంటుంది.

ఈ కెమెరా గురించి కానన్ ఇండియా ప్రెసిడెంట్, సిఇఒ కజుటాడా కోబయాషి మాట్లాడుతూ “మా  ప్రయాణంలో ఒక కొత్త మైలురాయిగా 2020లో ఈ‌ఓ‌ఎస్-1డి ఈ‌ఎక్స్ మార్క్ 3 లాంచ్ చేయటాన్ని మేము సంతోషిస్తున్నాము అలాగే ఈ కొత్త ఉత్పత్తి భారతదేశంలో ఫోటోగ్రఫీని ప్రోత్సహించడంలో మాకు ఎంతో దోహదపడుతుంది. ”అని అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios