సోనీ కంపెనీ నుండి సరికొత్త వాక్‌మ్యాన్

సోనీ కంపెనీ మళ్ళీ తాజాగా వాక్‌మ్యాన్‌ను తిరిగి లాంచ్ చేసింది. దీనిని సోనీ NW-A105 ఆండ్రాయిడ్ వాక్‌మన్ అని అంటారు.ఐపాడ్, ఇతర మ్యూజిక్ ప్లేయర్‌లు స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక దీని వాడకం తగ్గించేశారు.  

sony company launches new walkman avatar

సోనీ వాక్‌మ్యాన్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. సోని కంపెనీకి వాక్‌మ్యాన్ ఒక ఐకానిక్ ప్రాడక్ట్ అయితే ఇప్పుడు దాన్ని కొత్త రూపంలో తిరిగి లాంచ్ చేశారు. జపాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోనీ బుధవారం భారతదేశంలో NW-A105 ఆండ్రాయిడ్ వాక్‌మ్యాన్‌ను లాంచ్ చేసింది.సోనీ వాక్‌మ్యాన్ పేరు వినగానే చాలా మందికి ఇది గుర్తుండే ఉంటుంది.1990 లలో "ఇట్" గాడ్జెట్ వామ్, మైఖేల్ జాక్సన్, మడోన్నా ఇంకా మరెన్నో ఇష్టమైన పాటలను వినడానికి ఇష్టపడేవారు.

అయితే సోనీ వాక్‌మ్యాన్ ఇంతకు ముందు పాత మోడల్ లోపల ఆడియో క్యాసెట్‌ను వేసి హెడ్‌ఫోన్‌ల ద్వారా ఆడియో పాటలను వినే ఉంటారు. సోనీ కంపెనీ మళ్ళీ తాజాగా వాక్‌మ్యాన్‌ను తిరిగి లాంచ్ చేసింది. దీనిని సోనీ NW-A105 ఆండ్రాయిడ్ వాక్‌మన్ అని అంటారు.ఇది పాత వాక్‌మ్యాన్‌కు మోడల్ కు చాలా భిన్నంగా ఉంటుంది.

also read గాడ్జెట్స్ ప్రేమికులకు గుడ్ న్యూస్...తక్కువ ధరకే ఐఫోన్

దీని  పేరు లాగే ఇది  ఆండ్రోయిడ్ OS ద్వారా నడుస్తుందని తెలుస్తుంది. మంచి క్లియర్ సౌండ్ కోరుకునే వ్యక్తుల కోసం దీనిని నిర్మించారు. ఐపాడ్, ఇతర మ్యూజిక్ ప్లేయర్‌లు స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక దీని వాడకం తగ్గించేశారు. కొత్త సోనీ వాక్‌మన్ NW-A105 లో చాలా టెక్నికల్ ఫీచర్స్ ఉన్నయి.

sony company launches new walkman avatar

దీనికి 3.6-అంగుళాల టచ్ స్క్రీన్‌, 26 గంటల బ్యాటరీ లైఫ్, ఆండ్రాయిడ్ 9.0తో  నడుస్తుంది. కొత్త వాక్‌మ్యాన్ గురించి సోని సంస్థ చెప్పినట్లుగా సిడి క్వాలిటీ సౌండ్ కంటే మెరుగైన హై-రెసోల్యూషన్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది.మైక్రో ఎస్‌డి కార్డ్ ఉపయోగించి 128GB వరకు పెంచుకోవచ్చు. ఇందులో 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లతో సహా ఎక్ష్టెర్నల్ ఆడియో సోర్స్‌తో కనెక్ట్ చేయడానికి బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

also read మార్కెట్లోకి కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ కేవలం 1,299కే...

వై-ఫై కూడా ఇందులో ఉంది. వై-ఫై కనెక్షన్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన  సాంగ్స్ ఇంటర్నెట్ ద్వారా సెట్ చేసుకొని వినొచ్చు.సోనీ వాక్‌మన్ NW-A105 USB టైప్-సి ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.  MP3, FLAC, WAV వంటి అన్ని ప్రముఖ ఆడియో ఫార్మాట్‌లకు సపోర్ట్ ఉంది.


దీనికి మ్యానుయాల్ ఆపరేట్ కోసం కొన్ని బటన్లను ఇచ్చారు. వీటిలో ప్లేబ్యాక్ బటన్లు, ప్లే, పాజ్, నెక్స్ట్ ట్రాక్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అలాగే పవర్ బటన్స్ ఉన్నాయి.సోనీ వాక్‌మన్ NW-A105 ధర 23,990 రూపాయలు. 2020 జనవరి 24 న భారతదేశంలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇది ఒకే బ్లాక్ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios