Asianet News TeluguAsianet News Telugu

రెస్టారెంట్లు, హోటల్స్‌, కస్టమర్లకు పేటీఎం‌ గుడ్‌న్యూస్‌..

'స్కాన్ టు ఆర్డర్' తో రెస్టారెంట్లలో కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డరింగ్‌ను ప్రారంభించాలని పేటిఎం సంస్థ 10 రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది, రాబోయే కొద్ది రోజుల్లో దీనిని అన్ని రాష్ట్రాలలో తీసుకురావాలని యోచిస్తోంది.

Paytm appeals to state governments to implement 'Scan to Order' contactless food ordering at  restaurants
Author
Hyderabad, First Published Jun 11, 2020, 6:18 PM IST

భారతదేశ ఫైనాన్షియల్ సర్వీస్ ప్లాట్ ఫాం పేటిఎం హోటల్స్‌, కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ప్రస్తుత పరిస్థితులో  అన్నీ రంగాలు కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇందులో భాగంగా హోటల్‌ పరిశ్రమపై కూడా తీవ్రమైన ప్రభావం పడింది. లక్షలాది మంది భారతీయ ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించడానికి డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎం ముందుకొచ్చింది.

దాదాపు 10కి పైగా రాష్ట్ర ప్రభుత్వాలతో పేటిఎం చర్చలు జరుపుతోంది.  'స్కాన్ టు ఆర్డర్' పెరిట రెస్టారెంట్లలో కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డరింగ్‌ను ప్రారంభించాలని పేటీఎం ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది.కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డరింగ్ ద్వారా రెస్టారెంట్లు, కాఫీ షాపుల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ పేమెంట్లు చేయవచ్చు. ఇంకా సురక్షితమైన భోజనాన్ని కూడా ఆర్డర్ చేయవచ్చు.

రెస్టారెంట్లలో పేటీఎం 'స్కాన్ టు ఆర్డర్' పేరిట కాంటాక్ట్‌లెస్ క్యూ‌ఆర్ కోడ్-ఆధారంగా వినియోగదారులు రెస్టారెంట్ల పై నమ్మకాన్ని తిరిగి పొందవచ్చు. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు చేసిన ప్రదేశాలలోని రెస్టారెంట్లలో కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డరింగ్‌  ప్రారంభించటనికి పేటీఎం ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది, 

also read ట్విట్టర్ సరికొత్త ఫీచర్..రీట్వీట్ చేసే ముందు ప్రాంప్ట్ మెసేజ్...


పేటీఎం ఉపాధ్యక్షుడు నిఖిల్ సైగల్ మాట్లాడుతూ, "మా కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డరింగ్ ద్వారా  హోటల్స్ ని  తిరిగి వ్యాపారంలోకి తీసుకురావడం మాత్రమే కాకుండా వారి జీవితాలను కూడా కాపాడుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఈ వినూత్న ప్రయత్నం యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే  సామాజిక దూరాన్ని పాటించడం, అలాగే సురక్షితమైన మార్గంలో భోజనం చేయడం ఇంకా రాబోయే కొద్ది రోజులలో, దేశంలోని అన్ని వాణిజ్య సంస్థలలో కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డరింగ్ అమలు చేయాలని మేము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము"అని అన్నారు.

Paytm appeals to state governments to implement 'Scan to Order' contactless food ordering at  restaurants

పేటీఎం 'స్కాన్ టు ఆర్డర్' సామాజిక దూరాన్ని పాటించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా సురక్షితమైన భోజనం, పరిశుభ్రమైన ఆహార ఆర్డరింగ్ అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది.

రెస్టారెంట్లలో ప్రదర్శించే ప్రత్యేకమైన క్యూఆర్‌ కోడ్ ను కంపెనీ ఆవిష్కరించింది. వినియోగదారులు మెనూను బ్రౌజ్ చేయడానికి, వారి మొబైల్ ఫోన్‌ నుండి ఫుడ్ ఆర్డర్‌ చేయడానికి పేటీఎం యాప్ నుండి స్కాన్ చేయవచ్చు.

హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డరింగ్ కోసం పేటీఎం వాలెట్, పేటీఎం యూ‌పి‌ఐ, నెట్-బ్యాంకింగ్, సహా అన్నీ  పేమెంట్లకు సపోర్ట్ చేస్తుంది.

పేటీఎం 'స్కాన్ టు ఆర్డర్' క్యూ‌ఆర్ కోడ్‌ను రెస్టారెంట్లు, హోటల్స్ సంస్థలకు వైట్ లేబుల్ ఉత్పత్తిగా అందిస్తోంది. వారు వారి లోగో, బ్రాండ్ రంగును క్యూ‌ఆర్ కార్డులో ఉపయోగించుకోవచ్చు. మొదటి దశలో 1 లక్ష పైగా అవుట్లెట్లలో పేటీఎం 'స్కాన్ టు ఆర్డర్' ను ప్రారంభించటానికి కంపెనీ సిద్ధంగా ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios