ట్విట్టర్ సరికొత్త ఫీచర్..రీట్వీట్ చేసే ముందు ప్రాంప్ట్ మెసేజ్...

మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్ జూన్ 10, బుధవారం రోజున ఒక కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇది త్వరలో ఆండ్రాయిడ్‌ ఓఎస్ స్మార్ట్ ఫోన్లలో  ప్రవేశపెట్టనుంది. క్రొత్త ఫీచర్ ఏంటంటే ప్రాంప్ట్ మెసేజ్, ఇది ఒక యూసర్ ఏదైనా ఒక ట్వీట్ కి  రీట్వీట్ చేసేముందు చూపిస్తుంది.
 

Twitter  announced new feature user is ready to open articles before sharing

న్యూ ఢిల్లీ: సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్ జూన్ 10, బుధవారం రోజున కొత్త ఫీచర్‌ను  ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇది త్వరలో ఆండ్రాయిడ్‌లో ఓఎస్ స్మార్ట్ ఫోన్లలో టెస్టింగ్ చేసి ప్రవేశపెట్టాలని చూస్తుంది.

క్రొత్త ఫీచర్  ఏంటి అంటే ఒక ప్రాంప్ట్ సందేశం, ఒక ట్విట్టర్ యూసర్  మరొక ట్విట్టర్ యూసర్ ట్వీట్ కి రీట్వీట్ చేసే ముందు ప్రాంప్ట్ మెసేజ్ చూపిస్తుంది. యూసర్ ఏదైనా రీట్వీట్ చేయడానికి ముందు ట్వీట్ ని పూర్తిగా ఓపెన్ చేయాలా అని ప్రాంప్ట్ మెసేజ్ చూపిస్తుంది.

also read సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టింగ్స్‌..200 అకౌంట్స్‌ను డిలీట్ చేసిన ఫేస్‌బుక్

ఏదైనా సమాచారంపై చర్చను ప్రోత్సహించడానికి ఇలా చేస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. అలాగే మీరు ఏదైనా ఒక సమాచారం, లేదా ట్వీట్  షేర్ చేసే ముందు, లేదా మీరు రీట్వీట్ చేయడానికి ముందు దాన్ని రీడ్ ఫుల్ స్టోరీ/ట్వీట్  అని చూపించనుంది.


ఈ నెల ప్రారంభంలో ట్విట్టర్ ఫెక్ లేదా ఎడిట్ చేసిన వీడియోలను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. ఏదైనా ట్వీట్లలో తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి కూడా ఒక కొత్త మార్గాన్ని పరీక్షించింది. తప్పుడు సమాచారాన్ని ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లేబుల్ చేయడం ద్వారా వాటి క్రింద ‘తప్పుదారి పట్టించే హానికరమైన ట్వీట్’ ట్యాగ్ పెట్టలని చూస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios