ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తో విడుదల కానున్న ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్
జనవరి 16న ఇండియాలో ఒప్పో ఎఫ్ 15 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫోన్ అధికారికంగా విడుదల చేయడానికి ముందు ఒప్పో దాని ఫీచర్స్ లను టీజర్ల ద్వారా విడుదల చేస్తూ వినియోగదారులలో మరింత హైప్ క్రియేట్ చేసింది.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ ఒప్పో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో విడుదల చేయనుంది. జనవరి 16న ఇండియాలో ఒప్పో ఎఫ్ 15 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫోన్ అధికారికంగా విడుదల చేయడానికి ముందు ఒప్పో దాని ఫీచర్స్ లను టీజర్ల ద్వారా విడుదల చేస్తూ వినియోగదారులలో మరింత హైప్ క్రియేట్ చేసింది.
also read కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్...తక్కువ ధరకే ఎక్కువ ఛానెల్‌లు
ఒప్పో ఎఫ్ 11 ప్రో, ఒప్పో ఎఫ్ 9 ప్రోలకు అప్‌గ్రేడ్‌గా ఈ ఫోన్ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఒప్పో ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, వూక్ ఫ్లాష్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యే టెక్నాలజీని సొంతం చేసుకుంటుందని చైనా కంపెనీ తెలిపింది.ఒప్పో ఎఫ్ 15 లో సరికొత్త ఇన్-డిస్ల్పే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఒప్పో ఎఫ్ 15 గ్రేడియంట్ బ్యాక్ ఫినిష్‌తో ఎర్గోనామిక్ డిజైన్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హెచ్ డీ క్వాలిటీ వీడియోలు, ఫోటోలు తీసేందుకు వీలుగా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ సెన్సార్ ఉంటుంది. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ షూటర్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
వూక్ సాయంతో ఐదు నిమిషాలు ఛార్జింగ్ పెడితే రెండుగంటల పాటు ఫోన్ మాట్లాడుకునేందుకు ఒప్పో ఎఫ్ 15లో సదుపాయం ఉంది. స్మార్ట్ ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ 3.0 సెన్సార్‌తో వస్తుంది. ఇది వినియోగదారులను స్క్రీన్‌ను 0.32 సెకన్లలో అన్‌లాక్ చేయడానికి అలాగే హై-గ్రేడ్ భద్రతను కల్పిస్తుంది. ఒప్పో ఎఫ్15 స్మార్ట్ ఫోన్ 7.మిల్లీమీటర్ మందంతో పాటు 172గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
also read ఎయిర్‌టెల్ నుండి రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫ్లాన్లు
ఎర్గోనామిక్ తో డిజైన్ తో పాటు లేజర్ లైట్ రిఫ్లెక్షన్ బ్యాక్ కవర్ ను అందిస్తుంది.ఒప్పో ప్రచారంలో భాగంగా విడుదల చేసిన టీజర్ లలో ఫోన్ 8జీబీ ర్యామ్ ఉన్నట్లు నిర్దారించింది. ఒప్పో ఎఫ్15 ఫీచర్స్ ఇలా ఉండబోతున్నాయ్.దీని డిస్ ప్లే 6.40 ఇంచస్, ఓక్టాకోర్ ప్రాసెసర్, 48- మెగా ఫిక్సల్ ప్లస్ 8 మెగా ఫిక్సల్ రేర్ కెమెరా, 8 జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ, 1080*2400 ఫిక్సల్స్ స్క్రీన్ రెజెల్యూషన్, ఆండ్రాయిడ్ 9 ఓఎస్ తో పనిచేస్తుంది.