భారతి ఎయిర్‌టెల్ ఇండియాలోని టాప్ నెట్వర్క్ లలో ఒకటైన ఎయిర్‌టెల్ కొత్తగా రెండు  ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు రూ. 279, రూ. 379 ప్రవేశపెట్టింది. కొత్త ప్లాన్లు హై-స్పీడ్ డేటా,  ఎస్‌ఎం‌ఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్  ఎక్స్‌స్ట్రీమ్ యాప్ లకు యాక్సెస్ చేసుకోవచ్చు.

also read గాడ్జెట్స్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తున్న రియల్ మీ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్


ఈ సిరీస్‌లో రూ. 279 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా  హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నుంచి రూ.4 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అందించనుంది. న్యూ ఢిల్లీకి చెందిన టెల్కో భారతదేశంలో టారిఫ్ లను పెంచిన కొద్ది వారాలకే ఎయిర్టెల్  రూ.379, రూ. 279  ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించింది.


ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ ప్రకారం రూ. 279 ప్రీపెయిడ్ ప్లాన్  డైయిలీ 1.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్, 28 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌ పొందుతారు. ప్రీపెయిడ్ ప్లాన్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నుండి జీవిత బీమాతో పాటు షా అకాడమీ నుండి నాలుగు వారాల పాటు ఏదైనా కోర్సులు, వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఇంకా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ద్వారా ప్రీమియం కంటెంట్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా ఇస్తుంది. వినియోగదారులకు ఫాస్ట్‌టాగ్ కొనుగోలుపై  రూ. 100 క్యాష్‌బ్యాక్  కూడా వస్తుంది.

also read మొబైల్ ను ఎన్ని గంటలు వాడుతున్నామో తెలుసా?


ఎయిర్‌టెల్  రూ. 379  ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్ మొత్తం 6GB హై-స్పీడ్ డేటా యాక్సెస్, 900 ఎస్‌ఎం‌ఎస్ లు, 84 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కూడా షా అకాడమీలో నాలుగు వారాల పాటు ఏదైనా కోర్సుకు, వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్  వంటి లాభాలను పొందవచ్చు. రూ. 379 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా  ఫాస్ట్‌టాగ్ కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.100 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తుంది.


  
ఎయిర్‌టెల్ రూ. 379  ప్రీపెయిడ్ ప్లాన్ వోడాఫోన్ ఐడియా అందించే 379 ప్రీపెయిడ్ ప్లాన్ పోటీగా ప్రవేశపెట్టింది. రెండోది వోడాఫోన్ ఐడియాలాగే వాయిస్ కాలింగ్, హై-స్పీడ్ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే  84 రోజులు పాటు 1,000 ఎస్‌ఎం‌ఎస్ పొందుతారు.