Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్-గూగుల్ సయోధ్య: ఇక ఫైర్ టీవీలో యూట్యూబ్..

అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్ మధ్య  ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ రెండు సంస్థలు చేతులు కలపడంతో గూగుల్‌కి చెందిన యూట్యాబ్ ఇకపై అమెజాన్ ఫైర్ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. 

Amazon and Google settle feud, bring YouTube back to Fire TV   devices
Author
New Delhi, First Published Apr 20, 2019, 11:39 AM IST

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్ మధ్య  ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ రెండు సంస్థలు చేతులు కలపడంతో గూగుల్‌కి చెందిన యూట్యాబ్ ఇకపై అమెజాన్ ఫైర్ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. 

అదే విధంగా అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియో కంటెంట్‌ను కూడా గూగుల్ క్రోమ్‌క్యాస్ట్ యూజర్లు వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ టీవీ డివైజెస్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను పొందుపర్చనుండగా, ఫైర్ టీవీ డివైజ్‌లలో య్యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ కిడ్స్ యాప్స్ కూడా లభ్యం కానున్నాయి.

అయితే, ఎప్పట్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందనేది స్పష్టంగా తెలియజేయలేదు. అయితే, తాజాగా గూగుల్, అమెజాన్‌ల మధ్య కుదిరిన ఈ సయోధ్యతో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలకు చరమగీతం పాడినట్లయింది. 

కాగా, అమెజాన్ సుమారు నాలుగేళ్ల నుంచి గూగుల్‌కి చెందిన క్రోమ్ క్యాస్ట్ స్ట్రీమింగ్ అడాప్టర్‌ను తమ పోర్టల్‌లో విక్రయించడం నిలిపేసింది. గూగుల్ కూడా 2018 ప్రారంభంలోనే ఫైర్ టీవీ నుంచి యూట్యూబ్ యాప్‌ను తొలగించింది. ప్రస్తుతం చోటు చేసుకున్న సయోధ్య ఇరు సంస్థల యూజర్లకు కూడా మేలు కలిగించేదేనని చెప్పవచ్చు.

చదవండి: ‘చెప్పు’తో కొట్టుకున్నట్లే..: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్

Follow Us:
Download App:
  • android
  • ios