ఫుట్ బాల్‌లో ఆల్ టైమ్ టాప్ 10: ఆటగాళ్లు వీరే
ఫుట్ బాల్ ఆటలో ఆల్ టైం టాప్ ఆటగాళ్లు 10 మంది ఉన్నారు. తమ ప్రతిభా పాటవాలతో కీలక సమయాల్లో గోల్స్ చేసి తమ జట్ల విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఈ 10 మంది ఆల్ టైమ్ టాప్ ఆటగాళ్లుగా నిలిచారు.
న్యూఢిల్లీ:ప్రపంచంలోని పలు దేశాల్లో ఫుట్ బాల్ క్రీడకు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. పుట్ బాల్ మ్యాచులు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి చూసే అభిమానులకు కొదవ లేదు. తమ అభిమాన జట్టు ఓటమి పాలైతే జీర్ణించుకోలేని అభిమానులు నానా హంగామా చేసిన సందర్భాలు కూడ లేకపోలేదు. అలాంటి ఫుట్ బాల్ ఆటలో 2023లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు.
లియోనాల్ మెస్సీ టాప్ అత్యధిక గోల్స్ చేసి టాప్ లో నిలిచారు. 802 గోల్స్ ను మెస్సీ చేశారు.పీలే 767 గోల్స్ చేసి రెండో స్థానంలో నిలిచారు. డిగో మారడోనా 353 గోల్స్ చేసి మూడో స్థానంలో నిలిచారు. క్రిస్టినో రోనాల్డో 819 గోల్స్ తో నాలుగో స్థానంలో నిలిచారు. జోయాన్ క్రఫ్ 433 గోల్స్ తో ఐదో స్థానంలో నిలిచారు.జిందే జిడానే 156 గోల్స్ తో ఆరో స్థానంలో నిలిచారు. 718 గోల్స్ తో గెడ్ ముల్లర్ ఏడో స్థానంలో నిలిచారు.
414 గోల్స్ తో రోనాల్డో నాజారీయో ఎనిమిదో స్థానంలో నిలిచారు. 509 గోల్స్ తో అల్‌ఫ్రెడో డిస్టేఫానో 9వ స్థానంలో నిలిచారు.353 గోల్స్ తో మిచెల్ ప్లాటినో 10వ స్థానంలో నిలిచారు.
1.లియోనాల్ మెస్సీ (అర్జెంటీనా)
అర్జెంటీనాకు చెందిన లియోనాల్ మెస్సీ 802 గోల్స్ తో పుట్ బాల్ ప్లేయర్స్ లో టాప్ గా నిలిచారు. పుట్ బాల్ లో మెస్సీ తన ప్రతిభతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
2. పీలే (బ్రెజిల్):మూడు దఫాలు ప్రపంచకప్ విజేత. పీలేను తొలి ఫుట్ బాల్ సూపర్ స్టార్ గా కీర్తించబడ్డారు. బ్లాక్ పెర్ల్ గా కూడ ఆయనను పిలుస్తారు.
3. డిగో మారడోనా (అర్జెంటీనా):ఒక తరానికి డిగో మారడోనా స్పూర్తిని ఇచ్చాడు.1986 లో అర్జెంటీనా విజయపథంలో నడిపించడంలో కీలకపథంలో నడిచాడు. మారడోనా ప్రభావం పుట్ బాల్ చరిత్రలో నిలిచిపోతుంది.
4. క్రిస్టినా రోనాల్డో(పోర్చుగల్):
పోర్చుగల్ కు మొదటి ట్రోఫిని అందించడంలో క్రిస్టినా రోనాల్డో కీలక పాత్ర పోషించారు. 819 గోల్స్ సాధించి ఆయన నాలుగో స్థానంలో నిలిచారు.
5.జోయన్ క్రూఫ్ (నెదర్లాండ్స్): మూడు యూరోపియన్ టైటిల్స్ ను వరుసగా గెలుచుకోవడంలో క్రూఫ్ కీలక పాత్ర పోషించారు.
6. జినేడే జిందానే(ఫ్రాన్స్) పుట్ బాల్ పై జిందానే చెరగని ముద్ర వేశాడు. ఛాంపియన్స్ లీగ్ సహా పలు టైటిళ్ల గెలుపులో జిందానే కీలకపాత్ర పోషించారు. 1998 ప్రపంచకప్ లో ఫ్రాన్స్ విజయంలో జిందానే కీలకంగా వ్యవహరించారు.
7. గ్రెడ్ ముల్లర్(జర్మనీ)
ఫుట్ బాల్ ఆటలో జర్మనీ దేశంలో లెజెండ్ గా ముల్లర్ పేరొందారు. యూరోపియన్ చాంపియన్ షిప్ ను జర్మనీ 1972లో గెలుచుకోవడంలో ముల్లర్ కీలకంగా వ్యవహరించారు.
8. రోనాల్డో నజారియో (బ్రెజిల్): అద్భుతమైన ప్రతిభతో రొనాల్డో నజారియో టాప్ 10 ఫుట్ బాల్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచారు.
9.ఆల్‌ఫ్రెడో డిస్టేఫానో(అర్జెంటీనా) ఎనిమిది లా లిగా టైటిల్స్, వరుసగా ఐదు యూరోపియన్ టైటిల్స్ గెలుచుకోవడంలో ఆల్ ఫ్రెడో డిస్టేఫానో కీలకంగా వ్యవహరించారు.
10.మైఖేల్ ప్లాటిని(ఫ్రాన్స్) ఫ్రెంచ్ ఫుట్ బాల్ లో ప్లాటిని కీలక పాత్ర పోషించారు.