బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం... నలుగురు ఫుట్‌బాల్ ప్లేయర్లతో సహా...
కరోనా నుంచి కోలుకుని, తిరిగి జట్టులో చేరేందుకు వెళ్తుండగా విమాన ప్రమాదం...
పైలెట్‌తో సహా క్లబ్ ప్రెసిడెంట్, నలుగురు ఫుట్‌బాల్ ప్లేయర్లు మృతి...
మ్యాచ్ కోసం వెళ్తుండగా కుప్పకూలిన విమానం... బ్రెజిల్‌లో విషాద సంఘటన..
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగి, నలుగురు ఫుట్‌బాల్ ప్లేయర్లతో సహా ఆరుగురు మృతి చెందారు. ఆదివారం బ్రెజిల్‌లోని టొకాన్టిన్ రాష్ట్రంలో జరిగిన ఈ ప్రమాదంలో పాల్మాస్ ఫుట్‌బాల్ క్లబ్‌కి చెందిన నలుగురు ప్లేయర్లతో పాటు పైలెట్, నలుగురు ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణాలు కోల్పోయిన వారిలో పాల్మాస్ క్లబ్ ప్రెసిడెంట్ లాకస్ మీరా, ప్లేయర్లు లుకాస్ ప్రాక్సిడ్, గుల్ హెరిమ్, రాను లే, మార్కస్ మొలినారి ఉన్నారు. విమాన ప్రమాదంలో చనిపోయిన నలుగురు ప్లేయర్లు కరోనా నుంచి కోలుకుని, తిరిగి జట్టులో చేరేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కొన్ని రోజుల కరోనా బారిన పడిన ఈ నలుగురు ప్లేయర్లు కోలుకోవడంతో ప్రత్యేక విమానంలో మ్యాచ్‌కి బయలుదేరారు. విలానోవా జట్టుతో మ్యాచ్ ఆడేందుకు క్లబ్ ప్రెసిడెంట్ లాకస్ మీరా స్వయంగా ప్రత్యేక విమానంలో వీరిని తీసుకుని మ్యాచ్ జరిగే ప్రాంతానికి బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంతో తాత్కాలికంగా పోటీలను నిలిపివేసిన బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య, మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించింది.