అరుదైన మైలురాయి: కెరీర్‌లో 700వ గోల్ కొట్టిన క్రిస్టియానో రొనాల్డో

ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయిని అందుకున్నాడు. కెరీర్‌లో 700వ గోల్ కొట్టాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 

portugal football star Christiano Ronaldo strikes 700th goal

ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయిని అందుకున్నాడు. కెరీర్‌లో 700వ గోల్ కొట్టాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 

రొనాల్డో కన్నా ముందు జోసెఫ్ బికన్ (చెక్ రిపబ్లిక్) 805 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రొమారియో (బ్రెజిల్) 772, పీలే 767, ఫెరెన్ ఫుస్కాస్ ( హంగేరి) 746, గెర్డ్ ముల్లర్ (జర్మనీ) 735 గోల్స్‌తో నిలిచారు.

రోనాల్డో తర్వాత అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ 672 గోల్స్‌తో నిలిచాడు. యూరో 2020 క్వాలీఫైయింగ్ సందర్భంగా ఉక్రెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో 700వ గోల్ కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 1-2 తేడాతో ఓడిపోయింది. దీంతో యూరో 2020 గ్రూప్ బీలో ఉక్రెయిన్ 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. పోర్చుగల్ 11 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఈ ఏడాది జనవరిలో ‘‘ 2019 గ్లోబ్ సాకర్ అవార్డ్స్‌’’లో మెస్సీని వెనక్కినెట్టి రోనాల్డో ఈ ఏడాది బెస్ట్ ప్లేయర్ అవార్డును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రియల్ మాడ్రిడ్ జట్టు నుంచి జువెన్టస్ జట్టుకు మారిన అతను ఈ అవార్డును వరుసగా మూడో ఏట దక్కించుకోవడం విశేషం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios