FIFA: ఐస్ క్రీమ్ అనుకుని మైక్‌ను తినబోయాడు.. వైరల్ వీడియో

FIFA World Cup 2022: ఖతర్ లో   జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్  ఆఖరి దశకు చేరింది.  లీగ్, ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్ వరకూ ఈ  టోర్నీలో  అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో ఓడింది. 

Morocco Goalkeeper Yassine Bounou's Son Mistakes Mic For Ice cream, Video Went Viral in Social Media

ఖతర్ వేదికగా జరుగుతున్న   ప్రపంచకప్ లో  రేపు ఫ్రాన్స్,  అర్జెంటీనాలు తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.  అంతకంటే ముందు మూడు,  నాలుగో స్థానం కోసం నేటి రాత్రి మొరాకో, క్రొయేషియాలు తలపడనున్నాయి.  ఈ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చిన మొరాకో.. గతడేది రన్నరప్ గా నిలిచిన మొరాకో  ఆటగాళ్లు తమ ఆటతో అభిమానులను ఎంతగానో అలరించారు. మూడో స్థానం కోసం జరుగుతున్న పోరు ముందు   మొరాకో గోల్ కీపర్  యాసీ బౌనో కుమారుడు చేసిన పని సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. 

క్రొయేషియా మ్యాచ్  కు ముందు  మొరాకో.. క్వార్టర్స్ లో పోర్చుగల్ ను ఓడించింది.  ఈ మ్యాచ్ తర్వాత మొరాకో గోల్ కీపర్  యాసీ బౌనో  రిపోర్టర్ తో మాట్లాడటానికి  వచ్చాడు.  అప్పుడు  బౌనోతో అతడి కుమారుడు కూడా ఉన్నాడు. 

బౌనో మాట్లాడుతుండగా అతడి కుమారుడు తన ముందున్న మైక్ ను పదే పదే చూశాడు. చూడటానికి ఐస్ క్రీమ్ లా ఉన్న ఆ మైక్ ను చూసి.. అరే, ఇదేదో ఐస్ క్రీమ్ లా ఉంది.. చూస్తేనే నోరూరుతోంది.  ఓసారి టేస్ట్ చేస్తే పోలా అన్నట్టు  మైక్ దగ్గరికి వచ్చి దానిని తన నాలుకతో టచ్ చేశాడు. కొడుకు చేసిన పనిని గమనించిన బౌనోతో పాటు అక్కడే ఉన్న రిపోర్టర్ కు నవ్వాగలేదు.  ఆ బుడ్డోడు ఇలా రెండు సార్లు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

 

బౌనో ఫిఫా   ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు. ప్రత్యర్థి గోల్ కొట్టకుండా మంచి డిఫెన్స్ ను కలిగిఉన్న మొరాకో టీమ్ లో బౌనో కూడా కీలక పాత్రదారి. ప్రి క్వార్టర్స్ లో  ఆస్ట్రేలియాతో పాటు క్వార్టర్స్ లో  పోర్చుగల్ తో ప్రత్యర్థి జట్లు పలుమార్లు గోల్ చేయాలని చూసినా వాటిని అడ్డుకోవడంలో బౌనీ సక్సెస్ అయ్యాడు.  క్రిస్టియానో రొనాల్డో వంటి ఆటగాడు  గోల్స్ కోసం యత్నించినా  బౌనో చాకచక్యంగా అడ్డుకుని శెభాష్ అనిపించాడు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios