ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో దురదృష్టకర ఘటన : బాల్‌ను ఓవర్‌షాట్ చేస్తూ ప్రత్యర్ధి కాలును విరిచేశాడు.. వీడియో వైరల్
రియల్ మాడ్రిడ్ మాజీ దిగ్గజం మార్సెలో మంగళవారం కోపా లిబెటాడోర్స్ సందర్భంగా తన ప్రత్యర్థిని టాకిల్ చేసే సమయంలో ప్రత్యర్థి ఆటగాడి కాలిని విరిచేశాడు. ఫుట్‌వర్క్‌లో పేరొందిన మార్సెలో.. శాంచెజ్‌ను దాటుకుటూ వెళ్తుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
రియల్ మాడ్రిడ్ మాజీ దిగ్గజం మార్సెలో మంగళవారం కోపా లిబెటాడోర్స్ సందర్భంగా తన ప్రత్యర్థిని టాకిల్ చేసే సమయంలో ప్రత్యర్థి ఆటగాడి కాలిని విరిచేశాడు. అతనికి బలమైన గాయం కావడంతో మార్సెలో కన్నీటీ పర్యంతమయ్యాడు. బ్యూనస్ ఎయిర్స్‌లో అర్జెంటీనోస్ జూనియర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్లూమినెన్స్ ఎఫ్‌సీ మాజీ బ్రెజిలియన్ అంతర్జాతీయ ఆటగాడు రెడ్ కార్డ్ చూపించినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఫుట్‌వర్క్‌లో పేరొందిన మార్సెలో.. శాంచెజ్‌ను దాటుకుటూ వెళ్తుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఊహించని పరిణామంలో .. ఈ మాజీ రియల్ మాడ్రిడ్ స్టార్ లీడింగ్ ఫుట్ బంతిని ఓవర్‌షాట్ చేసి అర్జెంటీనా ఆటగాడి షిన్‌పై కొట్టాడు. దీంతో శాంచెజ్ కాల్ మెలితిరిగిపోయి.. అతను పిచ్‌పై కుప్పకూలాడు. ఈ పరిణామంతో మార్సెలో కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది శాంచెజ్‌ను స్ట్రెచర్‌పై మైదానం నుంచి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం సమీపంలోని ఫినోచిట్టో శానిటోరియంకు తరలించారు. అతను కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని శాంచెజ్ అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.
ఫీల్డ్ లోపల అది చాలా కష్టమైన క్షణం: మార్సెలో
ఈ భయంకరమైన ఘటనపై మార్సెలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘తాను ఈరోజు ఫీల్డ్‌లో కష్టమైన క్షణాన్ని అనుభవించాల్సి వచ్చింది. ప్రమాదవశాత్తూ తోటి సహచరుడిని గాయపరిచాను. శాంచెజ్ .. మీరు కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.