మెస్సీకి ప్రతిష్టాత్మక అవార్డు.. రొనాల్డో, లెవాండోస్కీ తర్వాత అర్జెంటీనా సారథే..

Lionel Messi:గతేడాది నవంబర్ - డిసెంబర్ లో  ఖతార్ వేదికగా ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో   అర్జెంటీనాకు 36 ఏండ్ల తర్వాత వరల్డ్ కప్ అందించిన మెస్సీకి అవార్డులు క్యూ కడుతున్నాయి. 
 

Lionel Messi  Wins 2022 FIFA Best Player Award, Argentina Bags another MSV

సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ ప్రతిష్టాత్మక  ఫిఫా  పురుషుల బెస్ట్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు.  గతేడాది  చివర్లో ఖతార్ వేదికగా ముగిసిన ఫిఫా ప్రపంచకప్ లో   మెస్సీ..  అర్జెంటీనా జట్టును విజయవంతంగా నడిపించాడు.  టోర్నీ ఆసాంతం  రాణించి  ఫైనల్లో ఫ్రాన్స్ పై రెండు  గోల్స్ చేసి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.  ఈ ప్రదర్శనలతో  మెస్సీకి   మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కింది. 

మెస్సీ ఈ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి.  గతంలో  అతడు 2018లో  ఈ అవార్డు గెలుచుకున్నాడు. మెస్సీకి ముందు క్రిస్టియానో రొనాల్డో (2106, 2017) రెండు సార్లు   ఫిఫా  మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు.  అతడితో పాటు మరో దిగ్గజం  రాబర్ట్ లెవాండోస్కీ  (2020,  2021)  కూడా   రెండుసార్లు ఈ అవార్డును అందుకున్నాడు. 

ఈ అవార్దు కోసం మెస్సీ.. ఫ్రాన్స్  స్టార్ ప్లేయర్ ఎంబాపే, కరీమ్ బెంజెమలతో  పోటీ పడ్డా చివరికి  అర్జెంటీనా సారథికే అవార్డు దక్కింది. వివిధ దేశాల ఫుట్‌బాల్ కోచ్ లు, కెప్టెన్లు, ఫ్యాన్స్  ఓటింగ్ ద్వారా ఈ అవార్డు విజేతను ఎంపిక చేస్తారు.   2016 వరకు ఫ్రాన్స్ లోని బాలూన్ డి ఆర్  నిర్వాహకులతో కలిసిఉన్న ఈ నిర్వాహకులు ఆ తర్వాత ఫిఫా అవార్డులను ప్రత్యేకంగా ఇస్తున్నారు. 

 

2022 అవార్డుల జాబితా ఇది : 

ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ 2022 : లియోనల్ మెస్సీ 
బెస్ట్ కోచ్ : లియోనల్ స్కాలోని (అర్జెంటీనా) 
బెస్ట్ ఫెయిర్ ప్లే అవార్డు : లుకా లొచొష్విల్ 
ఫిఫా ఉమెన్స్ కోచ్ : సరినా వీగ్మన్ 
ఫిఫా బెస్ట్ గోల్ :  మర్సిన్ ఒల్క్సీ 
బెస్ట్ గోల్ కీపర్ : ఎమిలియానో మార్టీన్ 
ఉమెన్స్ గోల్ కీపర్ : మేరీ ఈర్ప్స్ 
బెస్ట్ ఉమెన్ ప్లేయర్ : అలెగ్జియా పుటెల్లస్ 
బెస్ట్ ఫ్యాన్స్ : అర్జెంటీనా 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios