Asianet News TeluguAsianet News Telugu

డోపింగ్ టెస్టులో విఫలం.. జువెంటస్ స్టార్ ఆటగాడు పాల్ పోగ్బాపై నాలుగేళ్ల నిషేధం, ఇక కెరీర్ ముగిసినట్లేనా..?

సెరీ ఏ లీగ్‌లో జువెంటస్‌కు కీలక ఆటగాడు.. ఫ్రెంచ్ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బా .. గతేడాది ఆగస్టులో డ్రగ్స్‌ పరీక్షలో విఫలమై ఫుట్‌బాల్ నుంచి నాలుగేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. పాజిటివ్ రిజల్ట్‌కు దారితీసే పదార్ధాన్ని అతను అనుకోకుండా వినియోగించాడని చెప్పడం ద్వారా శిక్ష తగ్గించాలని పోగ్బా లీగల్ టీమ్ ప్రయత్నించింది. 

Juventus star Paul Pogba BANNED from football for four years for doping, potentially ending career ksp
Author
First Published Feb 29, 2024, 7:16 PM IST

సెరీ ఏ లీగ్‌లో జువెంటస్‌కు కీలక ఆటగాడు.. ఫ్రెంచ్ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బా .. గతేడాది ఆగస్టులో డ్రగ్స్‌ పరీక్షలో విఫలమై ఫుట్‌బాల్ నుంచి నాలుగేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. లా రిపబ్లికా ప్రకారం.. సీజన్‌లో జువెంటస్ ప్రారంభ మ్యాచ్ వర్సెస్ ఉడినీస్ అనంతరం 30 ఏళ్ల మాజీ మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ టెస్టోస్టెరాన్ పరీక్ష ధృవీకరణను పొందాడు. తదనంతరం ఇటలీలోని యాంటీ డోపింగ్ ప్రాసిక్యూటర్ కార్యాలయం గురువారం భారీ పెనాల్టీని జారీ చేసింది.

పోగ్బా లీగల్ టీమ్ అభ్యర్ధన ఒప్పందాన్ని కూడా తిరస్కరించింది. పాజిటివ్ రిజల్ట్‌కు దారితీసే పదార్ధాన్ని అతను అనుకోకుండా వినియోగించాడని చెప్పడం ద్వారా శిక్ష తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయినప్పటికీ, ప్రాసిక్యూషన్ పోగ్బా పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నిషేధం కారణంగా ఆయన కెరీర్ ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

 

వచ్చే నెలలో తన 31వ పుట్టినరోజును జరుపుకోనున్న పోగ్బా.. దాదాపు 35 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆటలో పాలుపంచుకోలేడు. పోగ్బా సస్పెన్షన్ అతని కెరీర్‌పై మాయని మచ్చ వేయడమే కాకుండా.. సిరీ లే లీగ్‌లోని ప్రముఖ జట్లలో ఒకటైన జువెంటస్‌కు కూడా చిక్కులను కలిగిస్తుంది. పోగ్బా సస్పెన్షన్ గతంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాడిగా వున్న అతని కెరీర్‌‌‌‌ ఈ విధంగా పతనమవుతుందని అనుకోలేదు. క్లబ్ అకాడమీ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి జువెంటస్‌లో రాణించిన పోగ్బా.. 2016లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌కు తిరిగి వచ్చాడు. మాంచెస్టర్ యునైటెడ్ .. ఇటాలియన్ జెయింట్స్‌ నుంచి పోగ్బాను పొందేందుకు 89 మిలియన్ పౌండ్లను వెచ్చించింది. 

పోగ్బా రెండేళ్ల తర్వాత ఫ్రాన్స్‌తో ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నాడు. క్రొయేషియాతో జరిగిన ఫైనల్‌లో గోల్ చేసిన అతను.. యునైటెడ్‌లో మాత్రం ఈ విజయాన్ని రిపీట్ చేయడంలో విఫలమయ్యాడు. 2022లో రెండవసారి 13 సార్లు ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌లను విడిచిపెట్టి.. తన కెరీర్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో ఉచిత బదిలీపై జువెంటస్‌లో చేరాడు. పోగ్బాను గాయాల బెడద వెంటాడి సీజన్‌లో చాలా వరకు పక్కన వుండాల్సి వచ్చింది.

2023-24 సీజన్‌లో వారి ప్రారంభ మ్యాచ్‌లో బెంచ్‌లో పేరున్నప్పటికీ ఉడినీస్‌తో పోగ్బాను తుది జట్టులోకి తీసుకోలేదు. మ్యాచ్ అనంతరం జరిగిన టెస్టులో పోగ్బాపై నాలుగేళ్ల నిషేధం పడింది. ప్రైమరీ పాజిటివ్ టెస్ట్ తర్వాత.. పోగ్బా తన బీ శాంపిల్‌ను పరిశీలించాల్సిందిగా అభ్యర్ధించాడు. అక్టోబర్‌లో మరోసారి రిజల్ట్ పాజిటివ్‌గా రాగా.. జువెంటస్ అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసేలా చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios