ఇండియన్ సూపర్ లీగ్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయాలను చవిచూసిన హైదరాబాద్ ఎఫ్‌సీ, గ్రాండ్ విక్టరీతో కమ్‌బ్యాక్ ఇచ్చింది. చెన్నయిన్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో అద్భుత విజయం అందుకుంది హైదరాబాద్ జట్టు. ఐదు గోల్స్ నమోదైన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ హాఫ్‌లో సింగిల్ గోల్ కూడా రాకపోవడం విశేషం.

ఆట 50వ గోల్ చేసిన జోయల్ చియోనెస్, హైదరాబాద్ జట్టుకి తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 53వ నిమిషంలో హాలీచరణ్ గోల్ చేయడంతో హైదరాబాద్ 2-0 తేడాతో మంచి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 67వ నిమిషంలో చెన్నయిన్ ప్లేయర్ అనిరుథ్ గోల్ చేయడంతో హైదరాబాద్ ఆధిక్యం 2-1 తేడాతో తగ్గింది. 

అయితే 74వ నిమిషంలో విక్టర్, 79వ హాలిచరణ్ మరో గోల్ కొట్టి... హైదరాబాద్‌కి తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ఈ సీజన్‌లో మూడో విజయాన్ని అందుకున్న హైదరాబాద్, ఆరో స్థానానికి ఎగబాకింది. 9 మ్యాచుల్లో రెండు విజయాలు అందుకున్న చెన్నయిన్ 8వ స్థానానికి పడిపోయింది.