ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్‌లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ మరో విజయాన్ని అందుకుంది. ఈస్ట్ బెంగాల్‌కి సీజన్ మధ్యలో తాత్కాలిక కెప్టెన్‌గా నియమితుడైన నౌషాద్ మూసా... జట్టులో నాలుగు మార్పులు చేశాడు. ఆట ప్రారంభమైన 20వ నిమిషంలో గోల్ చేసి, ఈస్ట్ బెంగాల్ జట్టుకి ఆధిక్యాన్ని అందించాడు ఆ జట్టు ప్లేయర్ మట్టి స్టెయిన్‌మన్.

1-0 తేడాతో దక్కిన ఆధిక్యాన్ని చివరి వరకూ కాపాడుకున్న ఈస్ట్ బెంగాల్... బెంగళూరు ఎఫ్‌సీ ప్లేయర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సెకండ్ హాఫ్‌లో బెంగళూరు ఎఫ్‌సీకి దక్కిన కొన్ని ఛాన్సులను గోల్స్‌గా మలచడంలో ఆ జట్టు ప్లేయర్లు విఫలమయ్యాడు. 

ఇది ఈస్ట్ బెంగాల్‌కి ఈ సీజన్‌లో రెండో విజయం. కానీ ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో ఒక్కటి కూడా ఓడని ఈస్ట్ బెంగాల్, రెండు విజయాలను అందుకుంది. మరోవైపు బెంగళూరు ఎఫ్‌సీ సీజన్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడింది.